Telangana Politics: మే 7న తెలంగాణకు మాయావతి.. బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్‭లో భారీ సభ

మైనారిటీలలో 136 కులాలున్నాయని, వీటిలో అనేక మంది కూలీ పని చేసుకుంటూ గడుపుతున్నారని అన్నారు. అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దేశాన్ని రక్షించాల్సిన హోం మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు

Telangana Politics: మే 7న తెలంగాణకు మాయావతి.. బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్‭లో భారీ సభ

Mayawati

Telangana Politics: వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్‭లోని సరూర్ నగర్ గ్రౌండ్స్‭లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ జరగనుంది. ఈ సభకు బీఎస్పీ సుప్రెమో మాయావతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరిన అనంతరం మొట్టమొదటిసారి మాయావతి తెలంగాణకు వస్తుండడంతో సభను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Minister Harish Rao: కాంగ్రెస్, బీజేపీ చీఫ్ ట్రిక్స్ చేస్తున్నాయి.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం..

ఇక ఆదివారం చేవెళ్లలో అమిత్ షా నిర్వహించిన మీటింగుపై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాకు రిజర్వేషన్ల మీద ఏమాత్రం అవగాహన లేదని, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేయాలనడం దారుణమని మండిపడ్డారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా, పీఎస్ కృష్ణన్ కమిటీ.. ముస్లిం స్థితిగతులపై పరిశోధన జరిపిన అనంతరం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్లు మతం పేరిట ఇచ్చినవి కాదన్న ఆయన, కేంద్ర హోం మంత్రికి ఈ మాత్రం తెలవకుండా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Tamil Nadu: ఇక నుంచి పెళ్లిల్లలో కూడా మద్యం సరఫరా చేయొచ్చు.. ప్రత్యేక లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం

మైనారిటీలలో 136 కులాలున్నాయని, వీటిలో అనేక మంది కూలీ పని చేసుకుంటూ గడుపుతున్నారని అన్నారు. అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దేశాన్ని రక్షించాల్సిన హోం మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. అమిత్ షా చేసిన రిజర్వేషన్ల తొలగింపు ప్రకటనను బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తోందన్న ఆయన అవసరమైతే వారి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక తన వ్యాఖ్యల్ని అమిత్ షా వెంటనే వెనక్కి తీసుకోవాలతీ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.