సంక్రాంతికి JBS – MGBS మెట్రో

  • Published By: madhu ,Published On : December 22, 2019 / 02:13 AM IST
సంక్రాంతికి JBS – MGBS మెట్రో

జూబ్లి బస్ స్టేషన్ – ఎంజీబీఎస్ మార్గంలో త్వరలోనే మెట్రో పరుగులు తీయనుంది. ప్రస్తుతం సన్నాహక పరుగుల ప్రక్రియను చేపడుతున్నారు మెట్రో అధికారులు. నిబంధనల ప్రకారం 45 రోజులు దీనిని నిర్వహించాల్సి ఉంటుందని L & T హైదరాబాద్ మెట్రో రైలు జీఎం ఏడుకొండలు వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో డాక్టర్ ఏ రామకృష్ణ స్మారకోపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా ఓవర్ వ్యూ ఆఫ్ హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. 

హైటెక్ సిటీ ఆయన ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనమని, దాని చుట్టూ నెక్లెస్‌లా నిర్మించిన మెట్రో రైలు నిర్మాణం కూడా ఆయన ఆలోచనలకు ప్రతిరూపం అని కొనియాడారు. ప్రపంచంలోనే మెట్రో రైలు ప్రాజెక్టులన్నింటిలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అత్యుత్తమైనదిగా అభివర్ణించారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన గొప్ప ప్రాజెక్టు అన్నారు. ఎల్ అండ్ టీ సంస్థ కాకుండా మరే ఇతర సంస్థ ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టలేదని చెప్పుకొచ్చారు. 

* కారిడార్ – 2 నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న 10 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
* పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌ పద్ధతిలో నిర్మించిన మెట్రో రైల్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డు సాధించింది. 
* గత రెండు సంవత్సరాల్లో 12 కోట్ల 5లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు.
* మొత్తం రెండు సంవత్సరాల కాలంలో 4లక్షలకు పైన ట్రిప్పులతో.. 86 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఘనత మెట్రోకే దక్కుతుంది. 
 

* ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్‌‌ పెడుతూ.. సౌండ్ పొల్యూషన్‌కి దూరంగా.. స్మార్ట్‌‌, ఎకో ఫ్రెండ్లీ విధానంతో హైదరాబాద్ మెట్రో దూసుకుపోతోంది.
* ఇది కీలక మార్గమని మెట్రో అధికారులు అంటున్నారు. జూబ్లీ బస్‌స్టేషన్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, వ్యాపార కేంద్రం సుల్తాన్‌ బజార్‌, దూర ప్రాంత ప్రయాణికుల బస్టాండ్‌ ఎంజీబీఎస్‌ ఉన్నాయని చెబుతున్నారు.
* ఈ కారిడార్‌ అందుబాటులోకి వస్తే.. నారాయణగూడ చుట్టుపక్కల ఉండే వారు జేబీఎస్‌-పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్‌లో దిగి హైటెక్‌ సిటీకి చేరుకోవచ్చు. 
* ఎల్‌బీనగర్‌‌లో నుండే వారు ఎంజీబీఎస్‌ వరకు వచ్చి అక్కడ మెట్రో మారి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోవచ్చు. కారిడార్‌ – 2తో ఎటు నుంచి ఎటైనా వెళ్లొచ్చు.
Read More : రాష్ట్రపతి పర్యటన : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు