లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్ – ఏపీ మంత్రి అనీల్

  • Published By: madhu ,Published On : November 2, 2019 / 09:03 AM IST
లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్ – ఏపీ మంత్రి అనీల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్‌కు ఏపీ మంత్రి అనీల్ విమర్శలు చేశారు. ఆయన చేసేది లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్ అంటూ ఎద్దేవా చేశారు. విశాఖలో ధర్నా చేసి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. పారదర్శక పాలన కొనసాగిస్తుంటే..అవనసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికిని కోల్పోతున్నామని బాబు దిగజారి ప్రవర్తిస్తున్నారని, నేనున్నా..అని బాబుకి దత్తపుత్రుడిలా పవన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చెప్పిందే చెబుతూ..డ్రామా ఆర్టిస్టులా తయారయ్యారని బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి అనీల్. 

ఏపీ ఇసుకపై జరుగుతున్న రగడపై ఆయన స్పందించారు. వరద సమయాల్లో ఇసుక ఎలా తీస్తారు ? అని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా ఇసుకపై విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వంలో చలనలం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ధర్నాలు నిర్వహించగా..విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని జనసేనానీ నిర్ణయించారు. కొన్ని పార్టీలు దీనికి దూరంగా ఉన్నాయి. 
Read More : ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్య