అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ : చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడి భూముల గుట్టు చెప్పిన బొత్స

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. మంగళవారం (ఆగస్టు 27,2019) అందుకు సంబంధించిన

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 01:05 PM IST
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ : చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడి భూముల గుట్టు చెప్పిన బొత్స

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. మంగళవారం (ఆగస్టు 27,2019) అందుకు సంబంధించిన

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. మంగళవారం (ఆగస్టు 27,2019) అందుకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కుటుంబసభ్యులతో పాటు మాజీ సీఎం చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడికి అమరావతిలో ఉన్న భూముల వివరాలు బొత్స వెల్లడించారు. చంద్రబాబు ఏపీఐఐసీ ద్వారా 500 ఎకరాలు తన బంధువులకు ఇచ్చారని చెప్పారు. పరిశ్రమల స్థాపన కింద ఈ స్థలం ఇచ్చారని తెలిపారు. ఒక ఎకరం కేవలం లక్ష రూపాయలకే కట్టబెట్టారని వివరించారు. జగ్గంపేట మండలం జయంతిపురం అనే గ్రామంలో భూమి ఇచ్చాక, దాన్ని రాజధాని ప్రాంతంలోకి చంద్రబాబు కలిపారని మంత్రి బొత్స తెలిపారు.

రాజధానిలో భూములు లేవని సుజనా చౌదరి అబద్దాలు చెబుతున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా చౌదరి సమీప బంధువు, సోదరుడి కుమార్తె పేర్లతో రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబులా మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యడం లేదని మంత్రి బొత్స అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజధానిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరదల వల్ల రాజధానికి నష్టం లేకుండా చూశామన్నారు.

ఏపీ రాజధాని ప్రాంతంలో తనకు కానీ, తన కుటుంబసభ్యుల పేరు మీద కానీ సెంటు భూమి కూడా లేదన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. సుజనా చౌదరి సమీప బంధువు జితిన్ కుమార్ కంపెనీ పేరు మీద చందర్లపాడు మండలంలో 110 ఎకరాలు ఉందని… సుజనా సోదరుడి కుమార్తెకు 14 ఎకరాలు ఉందని బొత్స వివరించారు. చంద్రబాబు వియ్యంకుడు వియ్యంకుడికి రాజధాని ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయించారని ఆరోపించారు. 

లోకేశ్ తోడల్లుడు తండ్రికి కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయన్నారు. రాజధాని పేరుతో జరిగిన అవినీతి, కుంభకోణాలను బయటపెడతామని బొత్స స్పష్టం చేశారు. రాజధాని విషయంలో అవినీతి జరిగిందనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలన్నారు. రాజధాని అంటే కేవలం ఒక సామాజికవర్గానికి చెందినది కాదని, అన్ని ప్రాంతాల వారిదని బొత్స అన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో అవినీతి జరిగిందని ఆరోపించిన బీజేపీ… ఇప్పుడెందుకు మాట మార్చిందో అర్థం కావడం లేదన్నారు.

Also Read : రాజధానిలో సుజనా భూములు ఇవే : బయటపెట్టిన మంత్రి బొత్స