హారన్ మోగిస్తే..అంతే : ముంబై ట్రాఫిక్ పోలీసుల వీడియోకు కేటీఆర్ ఫిదా

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 01:25 AM IST
హారన్ మోగిస్తే..అంతే : ముంబై ట్రాఫిక్ పోలీసుల వీడియోకు కేటీఆర్ ఫిదా

రోడ్డు మీదకు వస్తే చాలు ట్రాఫిక్‌తో వణికిపోతుంటారు వాహనదారులు. దుమ్ము, ధూళి రణగొణ ధ్వనులతో నిత్యం నరకం చూస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పరిస్థితి చెప్పనవసరం లేదు. గ్రీన్ లైట్ పడకుండ ముందే..హారన్‌లు అదే విధంగా మోగిస్తూనే ఉంటారు. కొంతమంది అయితే..కావాలనే మ్రోగిస్తూ..ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ముంబై పోలీసులు వినూత్నంగా ఆలోచించారు.

Read More : కరోనా : హైదరాబాద్‌లో 15 అనుమానిత కేసులు..9 మందికి నెగటివ్ రిపోర్టు

‘హారన్ నాట్ ఓకే ప్లీజ్’ అనే పేరిట ఓ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. హైదరాబాద్‌లో ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు. ముంబై ట్రాఫిక్ పోలీసుల వీడియోను ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 
 

అసలు ముంబే పోలీసులు ఏం చేశారు ? 

ముంబైలో వాహనదారులు విపరీతంగా హారన్ మోగిస్తున్న సంగతిని ట్రాఫిక్ పోలీసులు కనిపెట్టారు. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ‘పనిషింగ్ సిగ్నల్’ పేరిట శబ్ధ కాలుష్యాన్ని నమోదు చేసే డెసిబిల్ మీటర్ బోర్డులను ఏర్పాటు చేశారు. అంటే..రెడ్ లైట్ పడిన సమయంలో వాహనదారులు హారన్ కొడితే..ఎంత శబ్ధం వస్తుందో..ఆ మీటర్‌లో రికార్డు అవుతుంది. ఒకవేళ పరిమితిని దాటిందని అనుకొండి…రైడ్ లైట్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానుంది.

అంటే..హారన్ మోగిన ప్రతిసారి రెడ్ లైట్ తిరిగి ప్రారంభం అవుతుందన్నమాట. వెహికల్స్ గ్రీన్ లైట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సో…దీనివల్ల హారన్ మోగించడాన్ని తగ్గిస్తారని ముంబై పోలీసులు వెల్లడిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రయోగం చేశారు. ప్రయత్నం విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ముంబై పోలీసులు వెల్లడిస్తున్నారు.