స్థానిక ఎన్నికలు జరిగితే ఏపీలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ రగడకు దారితీసింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 06:20 AM IST
స్థానిక ఎన్నికలు జరిగితే ఏపీలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ రగడకు దారితీసింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం దుమారం రేపుతోంది. ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ రగడకు దారితీసింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం రచ్చకు దారితీసింది. దీనిపై ఏకంగా సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రమేష్ కుమార్ చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వంతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్నికలు వాయిదా వేయడం చంద్రబాబుకి లబ్ది చేకూర్చేందుకే అని ఆరోపించారు. దీనిపై స్పందించిన రమేష్ కుమార్ ఆరోపణలు ఖండించారు. ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కారణంగానే ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చిందని మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారం గవర్నర్ దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. రమేష్ కుమార్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సీఎం జగన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read | ఆంటీతో వాట్సప్ చాటింగ్….అది వద్దనే సరికి ఏం చేశాడో చూడండి

తాజాగా ఈ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం(మార్చి 18,2020) తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కరోనాను గ్రామ స్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని స్పష్టం చేశారు. స్థానికంగా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకంగా ఉంటుందని మంత్రి చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉన్న గోవాలోనూ ఎన్నికలు వాయిదా వేయలేదని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని ఎస్ఈసీ రమేష్ కుమార్ స్వయంగా కొన్ని రోజుల క్రితం చెప్పారని మంత్రి గుర్తు చేశారు. టీడీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టే, ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని మంత్రి ఆరోపించారు. రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. కరోనా వైరస్ కట్టడికి స్థానిక ప్రజాప్రతినిధులు అవసరం చాలా ఉందని ఆయన చెప్పారు.

ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని అధికార పార్టీ వ్యతిరేకిస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సమర్థించింది. ఎన్నికలు వాయిదా వేయడం కరెక్ట్ అని టీడీపీ నేతలు అన్నారు. కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయడం మంచి నిర్ణయమన్నారు. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. సీఎం జగన్ కు ప్రజల ప్రాణాల కన్నా రాజకీయాలు, ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే హక్కు సీఎం జగన్ కు లేదని చంద్రబాబు అన్నారు. సామాజికవర్గం పేరుతో ఈసీపై ఆరోపణలు చేయడం దారుణం అన్నారు.