Srinivas Goud : తెలంగాణలో ఏపీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం

తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా జలాలపై వివాదాలను ఏపీ ఆపాలని హితవు పలికారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు.

Srinivas Goud : తెలంగాణలో ఏపీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం

Srinivas Goud

Srinivas Goud : తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా జలాలపై వివాదాలను ఏపీ ఆపాలని హితవు పలికారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు.

తెలంగాణ వచ్చాక వ్యాపారాలు అడ్డుకుంటున్నారని తెలంగాణలోని ఏపీ ప్రజలు ఏనాడైనా చెప్పారా? ఒక్కరైనా ఫిర్యాదు చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. వారి ఆస్తులు, ఉద్యోగాలు, పరిశ్రమలకు తాము ఏమైనా ఇబ్బందులు పెట్టామా? అని నిలదీశారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలు ఇబ్బంది పడ్డారా? అని అడిగారు. తెలంగాణలో కాలనీలు, పార్కులకు పెట్టిన ఆంధ్రా వారి పేర్లను ఏమైనా మార్చామా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అసలు ఆనాడు ఆంధ్రా నేతలే తెలంగాణ అన్న పదాన్నే అసెంబ్లీలో పలకకుండా చేశారని మండిపడ్డారు. వేలాది మంది మరణాలకు నాటి ఆంధ్ర నాయకులే కారణమన్నారు.

తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలంటే సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకెళ్లాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆర్డీఎస్​ ప్రాజెక్టు విస్తరణతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు నాగార్జున సాగర్ వరకు పాకింది. తెలంగాణ మంత్రులు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, దివంగ‌త నేత వైఎస్సార్‌పై మాట‌ల తూటాలు పేల్చారు. ఏపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ మంత్రులు సైతం కాస్త ఘాటుగానే తెలంగాణ మంత్రుల వ్యాఖ్య‌ల‌కు కౌంట‌రిచ్చారు. రాజకీయ లబ్ది కోసం తెలంగాణ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అక్క‌డి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ మంత్రుల్లా అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదన్నారు. నీటి పంపకాల వివాదం అంశంపై త‌మ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు.

కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని, ఆంధ్రప్రదేశ్ దొంగ దారిలో, అక్రమ పద్దతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ మంత్రులు ఆరోపించారు. ఇంకా పాత రోజులు కావని.. తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రంగా ఏర్పడిందని….ఎవరి చెప్పు చేతుల్లో తెలంగాణ ప్రజలు లేరని అన్నార. మీ బానిసలు అధికారంలో లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మీ ప్రాంత వాసులు బానిసలుగా చేసుకొని ఆటలు సాగించారని … ఇప్పుడు మీ ఆటలు సాగవని.. ఇకనైనా మీ కుప్పిగంతలు ఆపండి ఆయన ఏపీ మంత్రులకు హితవు పలికారు. ఇలా.. తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. రాజకీయాలను మరింత వేడెక్కించాయి.