వైసీపీలో వెన్నుపోటు నాయకులు, ఎన్నికల వేళ సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సొంత పార్టీ నేతలపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని రోజా అన్నారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరు... మీడియా ముందుకొచ్చి వైసీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా అన్నారు.

వైసీపీలో వెన్నుపోటు నాయకులు, ఎన్నికల వేళ సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

mla roja sensational comments on ysrcp leaders: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సొంత పార్టీ నేతలపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని రోజా అన్నారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరు… మీడియా ముందుకొచ్చి వైసీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారే మరోసారి ఇప్పుడు ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరి, పుత్తూరు నియోజకవర్గాల్లో 14 మంది రెబల్స్ ను బరిలోకి దింపి.. ప్రతిపక్ష టీడీపీ గెలుపునకు సహకరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

రెబెల్స్ ను గెలిపించేందుకు భారీగా డబ్బు కూడా ఖర్చు చేశారని రోజా ఆరోపించారు. పార్టీలో ఉన్న కొందరు పెద్దలు.. రెబెల్ నాయకులకు సపోర్ట్ చేస్తూ వారేదో దేశ సేవకులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తల్లి పాలు తాగి రొమ్మును తన్నే విధంగా కొందరు నాయకులు ప్రవర్తించడం దారుణమన్నారు. వైసీపీలోనే ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కొందరు మీడియా ముందుకొచ్చి వైసీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా అన్నారు. వెన్నుపోటుదారులను పార్టీ అధిష్ఠానం గుర్తించాలని రోజా విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇప్పటికైనా అధిష్టానం చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం తప్పదని రోజా హెచ్చరించారు. ఏది ఏమైనా అన్ని కుట్రలనూ ఛేదించి నగరి, పుత్తూరులో వైసీపీనే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

నగరంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగానైతే వైసీపీ ఘన విజయం సాధించిందో అదే విధంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్నారని చెప్పారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారంటూ మున్సిపల్ ఎన్నికల రోజున ఫైర్ బ్రాండ్ రోజా చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

నగరి మున్సిపాలిటీలో 29 వార్డులకు 7 మాత్రమే రోజా ఏకగ్రీవం చేసుకోగలిగారు. మిగిలిన అన్ని వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అదే నియోజకవర్గంలోని మరో మున్సిపాలిటీ అయిన పుత్తూరులోని 27 వార్డుల్లో ఒకటి మాత్రమే ఏకగ్రీవం కాగా…మరో 26 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.