గన్నవరం పాలిటిక్స్ : వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్‌ఏ – కేశినేని నాని

  • Published By: madhu ,Published On : October 28, 2019 / 09:07 AM IST
గన్నవరం పాలిటిక్స్ : వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్‌ఏ – కేశినేని నాని

వల్లభనేని వంశీ ఇష్యూ టీడీపీలో కాకరేపుతోంది. వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వంశీని బుజ్జగించాలని నిర్ణయించిన చంద్రబాబు.. ఆ  బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణకు అప్పగించారు. అయితే వంశీ వ్యవహారంపై టీడీపీ నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వంశీకి అండగా నిలవాలని అంటుంటే మరికొందరు మాత్రం ఇదంతా మైండ్‌గేమ్ అంటున్నారు. 

వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్‌ఏ అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. వంశీని వదులుకోడానికి టీడీపీ సిద్ధంగా లేదని చెప్పారు. అలాగే వంశీ కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరన్నారు. వంశీతో మాట్లాడి సమస్యకు ముగింపు పలుకుతామమంటున్నారు. గన్నవరంలో ఉన్న పరిస్థితులు కొనకళ్ల నారాయణకు తెలుసని, 2009-2014 వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి వంశీ అని, పేదల కోసం..అట్టడుగు వర్గాల కోసం పనిచేశారని కితాబిచ్చారు.

పార్టీలో ఉంటే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. వంశీని చూసి ఈర్ష్య పడే నేతలు కూడా ఉంటారని, మొరిగే కుక్కలను పట్టించుకోవద్దన్నారు. వంశీ కొన్ని ఇబ్బందులు పడిన వాస్తవమేనని, అయితే..ఇబ్బందులతో పోరాటం చేస్తే..రాటు దేలుతామన్నారు. తాము మాట్లాడి..ఏమి చేయాలో అది చేస్తామన్నారు ఎంపీ కేశినేని. మరి బుజ్జగింపులతో వంశీ మెత్తబడుతారా ? లేదా ? అనేది చూడాలి. 

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు ఎవరూ ఊహించని ట్విస్ట్  ఇచ్చారు. ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబుకి పంపారు వంశీ. రాజకీయాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించారు. 
Read More : వంశీది డ్రామా : వైసీపీ కార్యకర్తలపై 4వేల అక్రమ కేసులు పెట్టారు