మున్సిపల్ ఎన్నికలు : TRS‌తో సర్దుబాటు చేసుకొనే ఛాన్స్ – చాడ

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 08:29 AM IST
మున్సిపల్ ఎన్నికలు : TRS‌తో సర్దుబాటు చేసుకొనే ఛాన్స్ – చాడ

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..మిత్రులు ఉండరని అంటుంటారు. ఎన్నికల సమయంలో అప్పటి దాక విమర్శలు, ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఒక్కటై పోతుంటాయి. పొత్తులతో కదన రంగంలోకి దూకుతుంటాయి. ఈ పొత్తులు ఒక్కసారి సక్సెస్ అవుతుంటాయి. మరోసారి ఫెయిల్ అవుతుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయాయి.

ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అయిపోతున్నాయి. అందులో భాగంగా పొత్తుల అంశంపై తెరపైకి వచ్చింది. తాజాగా సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తమకు శత్రువులు కారని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార పార్టీయైన TRS‌తో సర్దుబాటు చేసుకొనే ఛాన్స్ ఉందని, ఈ పార్టీతో చిన్న చిన్న విబేధాలున్నా..బీజేపీ మాత్రం తమ మొదటి శత్రువని చెప్పుకొచ్చారు.

బీజేపీ తప్ప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరితోనైనా కలవడానికి సిద్ధమని ప్రకటించారు. తమ మొదటి ప్రాధాన్యత మాత్రం సీపీఎంకేనని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సర్దుబాట్లు ఉంటాయన్నారు. అయితే..పొత్తులపై స్థానిక జిల్లా కమిటీలదే తుది నిర్ణయమన్నారు చాడ. మరి చాడ వ్యాఖ్యలతో టీఆర్ఎస్, ఇతర పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాలి. 

Read More : సందేశం కోసం : చీరలు కట్టుకుని వచ్చిన మగ విద్యార్థులు