Nara Lokesh : ఆయన చంద్రబాబుని పొగిడితే మీకెందుకు అంత మంట?- వైసీపీ నాయకులపై లోకేశ్ ఫైర్

Nara Lokesh : నాన్నా పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుందని ఆయన చెప్పారు. ఆయన సింగిల్ గా వచ్చి వెళ్ళిపోయారు. వైసిపి వాళ్ళు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు.

Nara Lokesh : ఆయన చంద్రబాబుని పొగిడితే మీకెందుకు అంత మంట?- వైసీపీ నాయకులపై లోకేశ్ ఫైర్

Nara Lokesh(Photo : Google)

Nara Lokesh : సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రజనీకాంత్ టార్గెట్ గా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ని చంపిన వ్యక్తిని రజనీకాంత్ పొగడటం దారుణం అంటున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. రజనీకాంత్ అన్న దాంట్లో తప్పేమీ లేదంటున్నారు. రజనీకాంత్ కు వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. రజనీకాంత్.. చంద్రబాబుని పొగిడితే మీకెందుకు అంత బాధ? అని వైసీపీ నాయకులను నిలదీశారు లోకేశ్.

” నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి, చంద్రబాబు విజన్ గురించి రజనీ మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడలేదు. వైసిపి గురించి అసలే మాట్లాడలేదు. చంద్రబాబు గొప్పతనం గురించి రజనీకాంత్ చెప్పడం చూసి సీఎం జగన్ టీవీ పగలకొట్టారట. రజనీకాంత్ ఎప్పుడో చెప్పారు. నాన్నా పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుందని. ఆయన సింగిల్ గా వచ్చి వెళ్ళిపోయారు. వైసిపి వాళ్ళు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. అందుకే వైసిపి వాళ్ళు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు” అని లోకేశ్ విమర్శించారు.

నేను పిల్లిని కాదు.. వేటాడే పులిని:
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. ”కోడుమూరు కేక పుట్టించింది. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే జగన్ కి గుండె దడ మొదలవ్వడం ఖాయం. సుంకేసుల బ్యారేజ్ కి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు పూర్తి చేశారు. జగన్ పేదల పాలిట శని. పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోంది అంటున్న జగన్.. దేశంలోనే ఎక్కువ డబ్బున్న సీఎం ఎలా అయ్యాడో చెప్పే దమ్ముందా?(Nara Lokesh)

Also Read..Rajinikanth : YCP నాయకులపై ఫైర్ అవుతున్న తలైవా ఫ్యాన్స్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

లక్ష కోట్లు సంపాదించడానికి సీక్రెట్ ఏంటో జగన్ పేదలకు చెప్పగలరా? ఆయన దేశంలోనే ధనిక సీఎం. కానీ ఏపీ ప్రజలు మాత్రం ఎప్పటికీ పేదరికంలోనే ఉండాలని జగన్ కోరుకుంటారు. జగన్ కి నేనంటే భయం. అందుకే నన్ను అడ్డుకోవడానికి రోజుకో గ్యాంగ్ ని పంపుతున్నారు. నేను ముందే చెప్పా.. సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. రౌడీ గ్యాంగులు వస్తే ఆగిపోవడానికి ప్యాలెస్ పిల్లిని కాదు బ్రదర్ జగన్. నిన్ను వేటాడే పులిని” అని లోకేశ్ హెచ్చరించారు.

” బాబాయ్ మర్డర్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. హత్య అర్ధరాత్రి 2.30 కి జరిగితే తెల్లవారుజామున 4.30 కి లోటస్ పాండ్ మీటింగ్ లో ఉన్న నలుగురు ముఖ్యమైన వ్యక్తులకు గుండెపోటుతో బాబాయ్ చనిపోయాడని జగన్ చెప్పారు. అంటే అప్పటికే కుట్లు వేసి కట్టుకట్టే కార్యక్రమం పూర్తిచేశారు.

ఆ మీటింగ్ లో ఉన్న నలుగురిని విచారిస్తే నిజమైన మాస్టర్ మైండ్ దొరికిపోవడం ఖాయం. జగన్ ది శాడిస్ట్ స్వభావం. వైఎస్ ని పొగిడినా తట్టుకోలేడు. అందుకే పేరు మార్చా. శాడిస్టు జగన్ అని పెట్టా. ప్రజల సమస్యలు తీర్చే ప్రజావేదిక కూల్చిన వారిని శాడిస్ట్ అనే అంటాం. ప్రకృతిని విధ్వంసం చేస్తూ రుషికొండకు గుండు కొట్టిన వాడిని శాడిస్ట్ అనే అంటాం. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆనంద పడేవాడిని శాడిస్ట్ అనే అంటాం. శాడిస్టు జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. శాడిస్ట్ జగన్ దళిత ద్రోహి” అని ఫైర్ అయ్యారు లోకేశ్.(Nara Lokesh)

Also Read..AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..

”కోడుమూరు నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒకరు సుధాకర్, మరొకరు షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. వీళ్లు నియోజకవర్గాన్ని కేకు ముక్కలా కోసుకొని భూములు, ఇసుక, ఎర్రమట్టి దోచుకుంటున్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కానీ ఇక్కడ పెత్తనం అంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిదే. నియోజకవర్గంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అన్నా షాడో ఎమ్మెల్యేకి 10 శాతం కప్పం కట్టాల్సిందే. కోడుమూరు కొండరాయుడు కొండను వైసిపి ఎర్రమట్టి మాఫియా అడ్డంగా తవ్వేసింది.

తుంగభద్ర నదిలో సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె, సింగవరం, ముడుమాల, పలదొడ్డి గ్రామాల వద్ద ఇసుక రీచులు నుండి అక్రమ ఇసుక రవాణ చేస్తున్నాడు షాడో ఎమ్మెల్యే. ఎమ్మెల్యే సుధాకర్ బంధువు సి.బెళగల్ జడ్పీటీసీ సభ్యుడు గిరిజోన్ ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణాలో సిద్ధహస్తుడు. అంగన్వాడీ ఉద్యోగాలను సైతం ఈ ఎమ్మెల్యే వదలలేదు. ఒక్కొ పోస్టుకు రూ.3-5 లక్షల వరకు వసూలు చేశారు. విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టుకు రూ.5 లక్షలు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నియమించాలంటే రూ.2 లక్షలు, ఆశా వర్కర్ కు రూ. 1.50 లక్షలు వసులు చేశారని ఆరోపణలు ఉన్నాయి” అని లోకేశ్ అన్నారు.(Nara Lokesh)