Nara Lokesh : లక్ష కోట్లు ఆస్తి ఉన్న వాడు పేదవాడా? అమెరికాలో ఉన్నా పట్టుకొస్తా- నారా లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh - Mahanadu : లక్ష కోట్లు ఆస్తి ఉన్న వాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల ఖరీదు చేసే బాటిల్ వాటర్ తాగేవాడు పేదవాడా?

Nara Lokesh : లక్ష కోట్లు ఆస్తి ఉన్న వాడు పేదవాడా? అమెరికాలో ఉన్నా పట్టుకొస్తా- నారా లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh

Nara Lokesh – Mahanadu : వైసీపీ నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ నేత నారా లోకేశ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలిపెట్టను అన్నారు. నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను. అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తా అని లోకేశ్ హెచ్చరించారు.

అందరూ బాధితులే..
టీడీపీ మహానాడులో ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు నారా లోకేశ్. లక్ష కోట్లు ఆస్తి ఉన్న వాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల ఖరీదు చేసే బాటిల్ వాటర్ తాగేవాడు పేదవాడా? అంటూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. పేదల జేబులో డబ్బులు కొట్టేస్తున్నారని, పేదల ఆకలి అరుపులు ఆయనకి ఆనందాన్ని ఇస్తాయని విమర్శించారు. సైకో జగన్ పాలనలో యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ బాధితులే అని వాపోయారు లోకేశ్.

Also Read..TDP Mahanadu 2023 : స్కాముల్లో జగన్‌ది మాస్టర్ మైండ్.. పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు వేసేలా ఏపీలో పాలన..

ఇంకా మగాడు పుట్టలేదు, పుట్టడు..
” తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం. తెలుగుదేశం పార్టీ కంచుకోటకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గోదారోళ్ల యటకారం, మమకారం రెండూ సూపర్. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్.
కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కి హిస్టరీ ఉంది. పార్టీని నడుపుతున్న బాబుకి క్యాలిబర్ ఉంది. తెలుగుదేశం పార్టీ, మన అధినేతల రికార్డులు కొట్టే మగాడు పుట్టలేదు, పుట్టడు. టీడీపీ అంటే ఘన చరిత్ర ఉన్న పార్టీ. వైసీపీ గలీజు పార్టీ.

అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తా..
యువగళం పాదయాత్ర అడ్డుకోవడానికి సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారు. నేను అంబేద్కర్ గారి రాజ్యాంగంతో సమాధానం చెప్పా. కార్యకర్తకు కష్టం వస్తే మీ లోకేష్ ఆగడు. కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే సైకో జగన్ స్పందించరు. నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను. అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తా.

సైకోని ప్యాలస్ లో పెట్టి పర్మినెంట్ గా తాళం వేద్దాం:
పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్ లో ఉంది. ప్రతిపక్షంలో పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత నాది. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది సైకో జగన్ కోరిక. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేశ్ సింగిల్ పాయింట్ ఎజెండా. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఉరి తీసి భూమిలో పాతేద్దాం. సైకోని ప్యాలస్ లో పెట్టి పర్మినెంట్ గా తాళం వేద్దాం” అని నారా లోకేశ్ అన్నారు.

Also Read..Kodali Nani : దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలి.. చంద్రబాబు, లోకేష్ కు కొడాలి నాని సవాల్

పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలి.. నడపడానికి కాలిబర్ ఉండాలి:
”కష్టం వస్తే పేదవాడు కన్నీరు తుడిచింది ఎన్టీఆర్. పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలి. నడపడానికి కాలిబర్ ఉండాలి. NTRకి హిస్టరీ ఉంది. చంద్రన్నకు కాలిబర్ ఉంది. టీడీపీని కొట్టే మొగాడు పుట్టలేదు. ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అడిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకో అయ్యాడు.
దేశంలోనే ధనిక సీఎం జగన్. లక్ష రూపాయలు చెప్పులు, వెయ్యి రూపాయలు ఖరీదు చేసే బాటిల్ లోని వాటర్ తాగేవాడు పేదవాడు అవుతాడా?

పబ్లిసిటీ పీక్, మేటర్ వీక్:
సైకో జగన్.. పబ్లిసిటీ పీక్, మేటర్ వీక్. సైకో జగన్ క్వార్టర్ జగన్. పేదల సంక్షేమాలను కట్ చేశారు. సైకో జగన్ పెయింట్ మాస్టర్. చంద్రబాబు టిడ్కో ఇల్లు కడితే వాటికి రంగులు వేశారు. జగన్ ఆలోచన ఒక్కటే. సెంట్ స్థలం తీసుకున్న వారు పేదవాడిగానే ఉండాలి. నా వయస్సు 40ఏళ్లు ఒక ఎత్తు అయితే, పాదయాత్ర చేసిన రోజులు ఒక ఎత్తు. పాపాల పెద్దిరెడ్డి, జగన్ అవినీతి చూశా. కాళహస్తిలో మునమ్మ నాకు సమస్యలు చెప్పారని వైసీపీ నాయుకుడు షాప్ కూలగొట్టారు. కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోను. ఇలాంటి సైకోలను ఎంతో మందిని టీడీపీ చూసింది. ఈ చిన్న సైకో ఒక లెక్కా?” అని విరుచుకుపడ్డారు లోకేశ్.