Bihar: సీఎం కుర్చీని తేజస్వీ యాదవ్‭కు వదిలేసిన నితీశ్ కుమార్.. అలా అని తాను పీఎం రేసులో కూడా లేరట

ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజశ్వీ యాదవే వచ్చే ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కూటమి తరపు ముఖ్యమంత్రి అభ్యర్థని నితీశ్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోక్‭సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితం విపక్షాల ప్రధాని అభ్యర్థి నితీశేనని తేజస్వీ అన్నారు. ఆ సమయంలో తాను ఈ విషయమై స్పందించనని అన్న నితీశ్.. తాను ఆ పోటీలో లేనని తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు.

Bihar: సీఎం కుర్చీని తేజస్వీ యాదవ్‭కు వదిలేసిన నితీశ్ కుమార్.. అలా అని తాను పీఎం రేసులో కూడా లేరట

Next Bihar Polls to Be Fought Under Tejashwi Yadav’: Nitish Kumar

Bihar: ముందస్తు ఊహగానాల ప్రకారమే ముఖ్యమంత్రి కుర్చీ నుంచి నితీశ్ కుమార్ తప్పుకోనున్నారు. ఆ కుర్చీలో తేజశ్వీ యాదవ్‭ను కూర్చోబెట్టనున్నారు. అయితే అది ఇప్పుడు కాదు, వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి వేసుకున్న ప్లాన్ ఇది. ప్రస్తుతం బీజేపీయేతర పక్షాలను ఏకం చేసి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు పనిలో ఉన్న నితీశ్ కుమార్ ఇక ఎంత మాత్రం బిహార్ రాజకీయాల్లో ఉండబోరని కొంత కాలంగా వస్తున్న వార్తలకు ఆయన అధికారికంగా నిర్ధారించారు. ఇక పోతే, తాను విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థనే వార్తలను మాత్రం తోసి పుచ్చారు. ముఖ్యమంత్రిగానే కాదు ప్రధానమంత్రిగాను కూడా ఉండబోనని కుండబద్దలు కొట్టారు.

Tamil Nadu: బీజేపీలోకి అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‭సెల్వం..! గుజరాత్‭లో కమల పార్టీ నేతలతో సమావేశం

మంగళవారం నలందలో డెంటల్ కళాశాల-ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజశ్వీ యాదవే వచ్చే ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కూటమి తరపు ముఖ్యమంత్రి అభ్యర్థని నితీశ్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోక్‭సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితం విపక్షాల ప్రధాని అభ్యర్థి నితీశేనని తేజస్వీ అన్నారు. ఆ సమయంలో తాను ఈ విషయమై స్పందించనని అన్న నితీశ్.. తాను ఆ పోటీలో లేనని తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు.

Bela Trivedi: బిల్కిస్ బానో వేసిన పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది

తమ ప్రధాన లక్ష్యం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమేనని, అందు కోసం కలిపి పోరాటం చేస్తామని అన్నారు. కొద్ది రోజుల పాటు దేశంలోని పలు విపక్ష పార్టీల నేతల్ని కలిసిన నితీశ్, ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇన్ని రోజులకు ఈ విషయమై స్పందించారు. బీజేపీయేతర కూటమికి జేడీయూ గట్టిగా పని చేస్తోందని చెప్పుకొచ్చారు. ఆయన ఈ ఏడాది ఆగస్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలిపి ఎనిమిదో సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.