రాహుల్, లోకేష్ లా అసమర్థడు కాదు : కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం

టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అనే అంశంపై చర్చ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఇష్యూ

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 09:51 AM IST
రాహుల్, లోకేష్ లా అసమర్థడు కాదు : కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం

టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అనే అంశంపై చర్చ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఇష్యూ

టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అనే అంశంపై చర్చ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ తర్వాత.. కేటీఆరే సీఎం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఇష్యూ మొదలైంది. ఆ తర్వాత స్వయంగా కేటీఆరే స్పందించారు. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆర్ అన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. మరో పదేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఆ ఇష్యూకి తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ మొదటికి వచ్చింది.

నెహ్రూ తర్వాత ఇందిర ప్రధాని అయ్యారు:
తాజాగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కేసీఆర్ తర్వాత కేటీఆరే తెలంగాణకు ముఖ్యమంత్రి అని చెప్పారు. కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతారన్నది కేసీఆరే నిర్ణయిస్తారని అన్నారు. వాస్తవానికి.. కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత కేటీఆర్ కు మాత్రమే ఉందన్నారు. నెహ్రూ తర్వాత ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారు, ఆ తర్వాత కూడా వాళ్ల కుటుంబానికి చెందినవారే వస్తున్నారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. అలాంటప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడంలో తప్పేముందన్నారు. కేటీఆర్ అన్ని విధాలుగా సమర్థుడని ఎర్రబెల్లి అన్నారు. పార్టీని, ప్రభుత్వంలోని కీలక శాఖల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారని వివరించారు. కేటీఆర్ నాయకత్వంలోనే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రమంతా కేటీఆర్ లీడర్ షిప్ కోరుకుంటున్నారని చెప్పారు.

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది..?
‘‘కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ తర్వాత ఆయన కూతురు ఇందిర ప్రధాని అయ్యారు. ఇందిర కొడుకు రాజీవ్ కూడా పీఎం అయ్యారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అందులో తప్పేముంది..? చంద్రబాబు కొడుకు లోకేశ్‌లా, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్‌లా.. కేటీఆర్ అసమర్థుడు కాదు. కేసీఆర్‌కు ఎంత సమర్థత ఉందో కేటీఆర్‌కు కూడా అంతే సమర్థత ఉంది’’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్:
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయం అని ఎర్రబెల్లి దీమాగా చెప్పారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందన్నారు. కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోతుందని, బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షాలు ఎన్నికలను వాయిదా వేయాలనడం కామన్ అయిపోయిందని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఓటింగ్‌లో లోపాల వల్లే ఓడిపోయామనడం కూడా కామన్ అయిపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించడంపై మంత్రి ఎర్రబెల్లి ఈ విమర్శలు చేశారు. ఓడిపోయేవారంతా ఎన్నికలకు ముందు ఇలాంటి పనులే చేస్తారని ఎద్దేవా చేశారు. గతంలో పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలోనూ వారు ఇలాంటి పనే చేశారని గుర్తు చేశారు.

కాగా, బుధవారం(జనవరి 1,2020) మీడియాతో చిట్ చాట్ లో.. కేసీఆర్ తర్వాత సీఎం నేను కాదు, మరో పదేళ్లు కేసీఆరే సీఎంగా కొనసాగుతారని స్వయంగా కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల్లోనే.. కాబోయే సీఎం కేటీఆరే అని ఎర్రబెల్లి దయాకర్ రావు అనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : మోహన్ బాబుకి ముద్దు పెట్టిన చిరంజీవి : అసలేం జరిగిందంటే..