Shashi Tharoor: నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఓబీసీలు కాదు.. బీజేపీ విమర్శలపై థరూర్ కౌంటర్ అటాక్

బీజేపీ నేతలు చేసిన విమర్శలు కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ తిప్పి కొట్టారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీలు ఓబీసీలే కాదని, మరి ఓబీసీలను రాహుల్ అవమానించారని బీజేపీ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ "మోదీ ఇంటిపేరు ఉన్న ప్రతి ఒక్కరూ దొంగలని రాహుల్ గాంధీ అన్లేదు. అలాగే నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) కాదు.

Shashi Tharoor: నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఓబీసీలు కాదు.. బీజేపీ విమర్శలపై థరూర్ కౌంటర్ అటాక్

Nirav Modi, Lalit Modi Not OBCs Says Shashi Tharoor

Shashi Tharoor: మోదీ అనే ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సూరత్ కోర్టు.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే ఆ మరుసటి రోజే ఈ శిక్ష ఆధారంగా రాహుల్ మీద పార్లమెంట్ సెక్రెటేరియట్ చర్యలకు దిగి, ఆయన లోక్‭సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే రాహుల్ మోదీ ఇంటి పేరును కించపర్చడం ద్వారా ఓబీసీలను అవమానించారంటూ అధికార భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Amritpal Singh: పోలీసులు తీవ్ర వేట నేపథ్యంలో అమృతపాల్ సింగ్‭కు సిక్కు సంఘం పిలుపు

అయితే బీజేపీ నేతలు చేసిన విమర్శలు కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ తిప్పి కొట్టారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీలు ఓబీసీలే కాదని, మరి ఓబీసీలను రాహుల్ అవమానించారని బీజేపీ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ “మోదీ ఇంటిపేరు ఉన్న ప్రతి ఒక్కరూ దొంగలని రాహుల్ గాంధీ అన్లేదు. అలాగే నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) కాదు. దీని ఆధారంగా రాహుల్ మీద నేరారోపణలు చేయడం విడ్డూరం. చాలా సీనియర్ మంత్రుల ప్రచార ప్రసంగాలను చూడండి. ప్రధానమంత్రి కూడా చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు” అని థరూర్ అన్నారు.

Karnataka Polls: కర్ణాటకను కుదిపివేస్తున్న ముస్లిం రిజర్వేషన్లు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హాట్ కామెంట్స్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో దోషిగా తేలడంతో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేశారు. “కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి” అని లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.