Bihar: ప్రచారం తప్పితే చేసిందేం లేదు.. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ నితీశ్ కుమార్

‘‘ఇప్పటి వరకు పేద రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే అది కేవలం ప్రచారం మాత్రమే. అంతకు మించి ఇంకేం చేయలేదు’’ అని అన్నారు. కొద్ది రోజుల క్రితం విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నితీశ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పేద రాష్ట్రాలను ప్రధానంగా తీసుకుని ప్రధానిపై విరుచుకుపడ్డారు.

Bihar: ప్రచారం తప్పితే చేసిందేం లేదు.. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ నితీశ్ కుమార్

Nitish Kumar attack PM modi over backward state special status

Bihar: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రచారం తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. పేద రాష్ట్రాలకు ఆయన చేసిందేమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. శుక్రవారం బిహార్ రాజధాని పాట్నాలోని ముఖ్యమంత్రి కార్యాయంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీపై మండిపడ్డారు.

‘‘ఇప్పటి వరకు పేద రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే అది కేవలం ప్రచారం మాత్రమే. అంతకు మించి ఇంకేం చేయలేదు’’ అని అన్నారు. కొద్ది రోజుల క్రితం విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నితీశ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పేద రాష్ట్రాలను ప్రధానంగా తీసుకుని ప్రధానిపై విరుచుకుపడ్డారు.

ఇక శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‭, విద్యా శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరితో కలిసి 200 మంది ఉర్దూ ట్రాన్స్‭లేటర్లు, స్టెనోగ్రాఫర్లకు నియామక పత్రాలు అందజేశారు సీఎం నితీశ్. తమ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దళితుల అభివృద్ధికి కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీరుతో బిహార్‭కు మొండి చేయే మిగిలిందని నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TRS MLAs: ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’కు అదనపు భద్రత.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం