Bihar: నితీశ్ కుమార్ ‘నపుంసకుడు’ అంటూ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

శనివారం షకీల్‌ మియాన్‌, జుద్దీన్‌ మియాన్‌లు నీలంపై దాడికి పాల్పడ్డారు. ఆమె తలపై, వీపుపై బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మార్కెట్లోనే అందరి ముందు ఈ దాడి జరిగింది. అయితే ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. స్పృహ తప్పే ముందు, తనపై దాడికి పాల్పడిన వారి పేరు వెల్లడించి నీలం. దీన్నిప్రత్యక్ష సాక్షులు తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు.

Bihar: నితీశ్ కుమార్ ‘నపుంసకుడు’ అంటూ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Bihar: కేంద్ర మంత్రి అశ్విని చౌబే సరికొత్త వివాదానికి తెర లేపారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘నపుంసకుడు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో దుమారానికి దారి తీశాయి. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చౌబే చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నుంచే కాకుండా ప్రజల నుంచి సైతం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ కించ పరిచే వ్యాఖ్యలు చేయొద్దంటూ మండిపడ్డుతున్నారు.

Bihar: కోర్టులో ఒక అధికారికి దారుణ అవమానం.. రిజర్వేషన్ మీద వచ్చారా అంటూ ప్రశ్నించిన జడ్జి, హేళనగా మాట్లాడిన లాయర్లు

బుధవారం మీడియాతో చౌబే మాట్లాడుతూ ‘‘గుజరాత్ ముఖ్యమంత్రి పూర్తిగా నపుంసకుడిగా మారిపోయారు. రాష్ట్రంలో రెండు రోజులుగా ప్రజలపై దారుణాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊరికే ఉండిపోతోంది. ఒక మహిళ తన చేతులతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది ఆటవిక రాజ్యమేనా? అంతకు మించి ఇంకేమైనా అనాలా? గడిచిన 48 గంటల్లో రాష్ట్రంలో ఆరు దుర్ఘటనలు జరిగాయి. వీటికి బాధ్యత వహిస్తూ నితీశ్ కుమార్ రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరిగిన ఘోరమైన నేరాలను చౌబే ప్రస్తావించారు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, భాగల్పూర్‌లో ఇద్దరు వ్యక్తులు, రద్దీగా ఉండే మార్కెట్‌లో క్రూరమైన దాడిలో ఆమె చేతులు, రొమ్ములు, చెవులు నరికివేయడంతో ఒక మహిళ మరణించింది. బాధితురాలు తన కూతురి పెళ్లి కోసం షకీల్ మియాన్ నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. అయితే ఆ డబ్బు తిరిగి చెల్లించలేకపోయిందని పోలీసులు తెలిపారు. బీజేపీ నేతలు వాదిస్తున్నట్లుగా ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని పోలీసులు వెల్లడించారు.

MCD Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచింది.. కానీ సినిమా ఇంకా మిగిలే ఉంది

శనివారం షకీల్‌ మియాన్‌, జుద్దీన్‌ మియాన్‌లు నీలంపై దాడికి పాల్పడ్డారు. ఆమె తలపై, వీపుపై బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మార్కెట్లోనే అందరి ముందు ఈ దాడి జరిగింది. అయితే ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. స్పృహ తప్పే ముందు, తనపై దాడికి పాల్పడిన వారి పేరు వెల్లడించి నీలం. దీన్నిప్రత్యక్ష సాక్షులు తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు.

అయితే రాష్ట్రంలో జరిగే నేరాల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బాగానే ఉంది కానీ, నితీశ్‭ను నపుంసకుడు అంటూ వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. రాజకీయ తప్పిదాల గురించి మాట్లాడకుండా వ్యక్తుల్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడుతున్నారు. ఈ విషయమై నితీశ్ పార్టీ అయిన జనతాదళ్-యునైటెడ్ శాసనసభ్యుడు సంజయ్ సింగ్ స్పందిస్తూ “ఇది కేంద్ర మంత్రి యొక్క మానసిక స్థాయిని చూపుతుంది. అతనికి సహాయం కావాలి” అని అన్నారు.