రూల్స్ ప్రజలకేనా, కరోనా నిబంధనలను లెక్క చేయని నిజామాబాద్ నేతలు

కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 10:25 AM IST
రూల్స్ ప్రజలకేనా, కరోనా నిబంధనలను లెక్క చేయని నిజామాబాద్ నేతలు

కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు

కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు లేదు. జనానికి చెప్పాల్సిన వారే పార్టీల్లో మునిగితేలిపోతున్నారట. ఇది చూసిన వారు ముక్కున వేలేసుకొంటున్నారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా వేసేస్తే పోలా అని అనుకొనేలా చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్‌ ఉన్నా క్యాంపు రాజకీయాలు:
నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుని ఎన్నిక కోసం జరిగే ఉప పోరులో త్రిముఖ పోరు ఖాయమైంది. ఇక్కడ అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి ఆశావహులు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడింది. టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి ప్రకటనలో జాప్యం జరిగింది. చివరకు టీఆర్ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత రంగంలోకి దిగడంతో బీజేపీ, కాంగ్రెస్‌ కూడా పోటీకి సిద్ధమయ్యాయి. బీజేపీ తరఫున ఉద్యోగ సంఘం మాజీ నేత, బీజేపీ నాయకులు పోతన్‌కర్ లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఒక పక్క కరోనా వైరస్‌ భయపెడుతోంది. గుంపులు గుంపులుగా జనాలు ఉండవద్దనే ఆదేశాలు జారీ అవుతున్నాయి. కానీ, అవన్నీ ప్రజలకే తప్ప.. ప్రజల్లో తాము లేమన్నట్టుగా ప్రజాప్రతినిధుల తీరుందని జనాలు అంటున్నారు. 

స్థానిక ప్రజా ప్రతినిధులకు ఓ రిసార్టులో పార్టీ..?:
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడి ఎన్నికకు 724 ఓటర్లు ఉండగా.. అందులో కాంగ్రెస్‌కు 140, బీజేపీకి 85 మంది సభ్యుల బలం ఉంది. ఇక మిగిలిన సభ్యులంతా టీఆర్ఎస్‌కు చెందిన వారే. క్రాస్ ఓటింగ్ జరగకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకనే చెప్పవచ్చు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడొద్దంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వగా.. సొంత పార్టీ నేతలే దాన్ని పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కూడా పాటించడం లేదంటున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు వందలాది మంది స్థానిక ప్రజా ప్రతినిధులకు ఓ రిసార్టులో పార్టీ ఇచ్చినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వందల మంది ఒకేచోట ఉంటే ప్రమాదం కాదా?:
ప్రజలకు జాగ్రత్తలు చెప్పి, మీరే ఇలా చేస్తే ఎలాగంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. టీఆర్ఎస్‌ నేతలే కాదు.. బీజేపీ, కాంగ్రెస్‌ లోకల్‌ బాడీ ప్రతినిధులతో కూడా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నట్టు జనాలు చెబుతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీలన్నీ క్యాంప్ రాజకీయాలకు తెరతీసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను రిసార్ట్స్‌లకు తరలించి పార్టీ ఏర్పాటు చేయడం ఎన్నికల సమయంలో ఉండేవే. కానీ, ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో ఇలా చేయడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా వందల మంది ఒకే చోట ఉండి పార్టీ చేసుకుంటే ఎలా అని.. ప్రజాప్రతినిధులే ఇలా చేస్తే ప్రజలు ఎందుకు మాట వింటారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు ఎన్నికలు వాయిదా వేసేస్తే బెటర్‌ అని అంటున్నారు.

Also Read | ఈ క్వాలిటీస్ ఉన్నవారికే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి