సిక్కోలు సీటుపై సిగపట్లు : ఎంపీ అభ్యర్ధులు ఎవరు

శ్రీకాకుళం : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిక్కోలు ఎంపీ అభ్యర్ధులపై టెన్షన్‌ పెరుగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, బరిలో కొత్తగా దూసుకొస్తున్న ఔత్సాహికులతో ఆ

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 02:58 PM IST
సిక్కోలు సీటుపై సిగపట్లు : ఎంపీ అభ్యర్ధులు ఎవరు

శ్రీకాకుళం : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిక్కోలు ఎంపీ అభ్యర్ధులపై టెన్షన్‌ పెరుగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, బరిలో కొత్తగా దూసుకొస్తున్న ఔత్సాహికులతో ఆ

శ్రీకాకుళం : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిక్కోలు ఎంపీ అభ్యర్ధులపై టెన్షన్‌ పెరుగుతోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, బరిలో కొత్తగా దూసుకొస్తున్న ఔత్సాహికులతో ఆ పార్లమెంట్ స్థానం అభ్యర్ధిత్వం అధిస్టానాలకు తలనొప్పిగా మారుతోంది. టీడీపీ, వైసీపీ, జనసేనల నుంచి న్యూ ఎంట్రీలతో క్లారిటీ మిస్‌ అయి కన్ఫ్యూజన్‌కు కేంద్ర బిందువుగా తయారవుతోంది.

 

శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ బరిలో కొత్త ముఖాలు మేము సైతం అంటూ సమరానికి సై అంటున్నాయి. తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ, ఈయనను అసెంబ్లీకి పంపిస్తారన్న చర్చ నడిచింది. అయితే ఎంపీ రామ్మోహన్ మాత్రం అదేం లేదని కొట్టి పారేస్తున్నప్పటికీ టీడీపీలో తమ అభ్యర్దిత్వాలు పరిశీలించమని మధ్యవర్తులు ద్వారా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణిని ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటే అభ్యర్ధిగా నిలిపే అవకాశం ఉందన్న చర్చ కూడా నడిచింది. అయితే కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ప్రసక్తి లేదని అధిస్ఠానాలు తెల్చేయడంతో కృపారాణికి టీడీపీ, వైసీపీల నుంచి ఆహ్వానాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన గురించి చూస్తే.. ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, పారిశ్రామికవేత్త గేదెల శ్రీనుబాబు శ్రీకాకుళం జిల్లా అల్లెన ప్రాంతీయుడు. ఈయన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక చోటు నుంచి ఎంపీగా దిగడం ఖాయం. ఈయనపై కూడా ఒక ప్రధాన పార్టీ రాజ్యసభ సీటు ఆఫర్‌తో చర్చలు నడుపుతున్నట్లు సమాచారం.

 

వైసీపీలో ఇప్పటికే ముగ్గురు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలు మారారు. ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ కో-ఆర్డినేటర్‌గా ఉన్నప్పటికీ టీడీపీ, జనసేనల్లో బలమైన అభ్యర్ధులున్నందున దువ్వాడకు మరో మంచి ఆఫరిచ్చి మాజీ మంత్రి ధర్మానను గానీ ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్‌ను గానీ బరిలోకి దింపే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధర్మాన ఎంపీ అభ్యర్ధిగా పోటికి సై అంటే ఆయన కోడలికి శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్దిగా మరో ఆఫర్ తలుపుతట్టే అవకాశం ఉంటుందని అనుచరులు భావిస్తున్నారు. అయితే జగన్ మాత్రం ధర్మానను ఎంపీగా పంపిస్తే అనకాపల్లి సమన్వయకర్త వరుదు కళ్యాణిని రంగంలోకి పంపే దిశగా ఆలోచిస్తున్నట్టు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

 

మొత్తం మీద శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఆశావహులు అధికంగా ఉండడంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రభావం చూపే నేత కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తుండడంతో ఏ పార్టీ కూడా ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నాయి.