ఆరేళ్లలో నల్గొండలో ఫ్లోరోసిస్ కేసు లేదు : గర్వంగా ఉందన్న కేటీఆర్

  • Published By: madhu ,Published On : February 29, 2020 / 09:02 AM IST
ఆరేళ్లలో నల్గొండలో ఫ్లోరోసిస్ కేసు లేదు : గర్వంగా ఉందన్న కేటీఆర్

ఆరు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 29వ తేదీ ట్విట్టర్ వేదికగా దినపత్రికకు సంబంధించిన కథనాన్ని పోస్టు చేశారు. వార్తను చదివిన అనంతరం తనకెంతో గర్వంగానూ..సంతోషంగానూ..ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్..దూరదృష్టితో ప్రతొక్కరికీ..మంచి నీటిని అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథలో భాగంగా అందరూ ఇంజినీర్లు, అధికారులు నల్గొండ తదితర జిల్లాల్లో ఎంతో శ్రమించారంటూ కితాబిచ్చారు. 

నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ అమలవుతుండడంతో ఆరు సంవత్సరాల్లో ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదని, ఇండియన్ నేచురల్ రీసోర్స్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్ మెంట్ (INREM) వ్యవస్థాపకులు, డైరెక్టర్ డా.రాజ్ నారాయణ్ వెల్లడించినట్లు దినపత్రిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న స్పష్టమైన నిర్ణయాలు, మిషన్ భగీరథ కనబరుస్తున్న శ్రద్ధయే కారణమని వెల్లడించింది.

ఫ్లోరైడ్ రీహాబిలిటేషన్ సెంటర్లపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. మంచినీటి నాణ్యత, కలర్‌, వాసనలను పరిశీలిస్తున్నామని, ఇది ప్రజలు కూడా తనిఖీ చేయాలని డా.ఇందు తెలిపారు. ప్రజల మనస్థత్వాన్ని మార్చాలని తాము ప్రయత్నిస్తున్నామన్నారు. గత ఆరు సంవత్సరాలుగా జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో INREM ఫౌండేషన్ పని చేస్తోందని డాక్టర్ ఇందూ తెలిపారు. నీటి నాణ్యత గురించి, ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. 

 Also Read | తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు వీరే

RO ప్లాంట్ వ్యాపారాన్ని నిరుత్సాహ పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. వాటర్ ప్లాంట్ల యజమానులు నీటి నుంచి లాభం పొందుతున్నారని, సబ్సిడీ రేటుతో సరఫరా చేసే విద్యుత్‌ ఉచితంగా పొందుతున్నారని కామెంట్ చేశారు. ప్రైవేటు నీటి యజమానులు డబ్బులు సంపాదించుకొనే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. RO ప్లాంట్లకు, విద్యుత్ సబ్సిడీ లేకుండా చూసుకోవడం, పంపు నీరు, బోర్ వెల్‌ల నుంచి నీటిని తీయడానికి ప్రభుత్వం రేట్లను నిర్ణయించాలని సూచించారు. 

Read More : వేసవిలో కరెంటు కోతలు ఉండవు.. !

అంతేగాకుండా..మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, ఇతర నీటి నాణ్యత పరీక్షా ఫలితాలను బోర్డుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయాలన్నారు. మిషన్ భగీరథ నీరు..RO నీటి కంటే చాలా సురక్షితం, ఆరోగ్యకరమైనదనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలన్నారు.