పార్టీ మారే ప్రసక్తే లేదు : తేల్చి చెప్పిన గంటా

  • Edited By: chvmurthy , February 17, 2019 / 08:01 AM IST
పార్టీ మారే ప్రసక్తే లేదు : తేల్చి చెప్పిన గంటా

విశాఖపట్నం :  అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ  తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక్‌సభ పోటీ చేయాలా? లేక అసెంబ్లీకి పోటీ చేయాలా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని  చెప్పారు.  ఎన్నికల్లో పోటీ చేయవద్దని పార్టీ ఆదేశించినా శిరాసావహిస్తానని గంటా అన్నారు. 

బీసీ గర్జన సభ పెట్టే అర్హత జగన్‌కు లేదని గంటా అన్నారు. 13 జిల్లాల్లో వైసీపీ ఎక్కడా బీసీ అధ్యక్షులను నియమించలేదని మంత్రి విమర్శించారు.  అవంతి శ్రీనివాస్ తనపై చేసిన వ్యాఖ్యలు పై మాట్లాడుతూ… కొందరి కోసం మాట్లాడి నా ప్రతిష్ట దిగజార్చుకోను అని ఆయన అన్నారు.