CWC: కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విభాగానికి ఎన్నికలు లేవు, సభ్యుల్ని అధ్యక్షుడు ఖర్గేనే నియమిస్తారట

కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకలు ఖర్గేకు స్వేచ్ఛనివ్వాలని, నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని భావించి కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. అయితే 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేసే మేధోమథన సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి

CWC: కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విభాగానికి ఎన్నికలు లేవు, సభ్యుల్ని అధ్యక్షుడు ఖర్గేనే నియమిస్తారట

No polls for top congress body, members nominated by Kharge

CWC: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే సర్వోన్నత విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్లూసీ)లోకి తీసుకునే సభ్యులను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేనే నియమించనున్నారట. ఇంతకు ముందు ఈ విభాగానికి సభ్యులు ఎన్నికల ద్వారా నియామకం అయ్యేవారు. అయితే ఈసారి మాత్రం అధ్యక్షుడే నియమించనున్నట్లు శుక్రవారం కాంగ్రెస్ పార్ట సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీకి సభ్యుల్ని పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా నిర్ణయిస్తారు. సీడబ్లూసీ సభ్యులందర్నీ ఆయనే నియమిస్తారు’’ అని పేర్కొన్నారు.

TSRTC: వేసవి కోసం ప్రయాణికులకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోన్న ఆర్టీసీ

కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ సింగ్ వంటి నేతలు ఎన్నికలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికలు నిర్వహించవచ్చని పార్టీ సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దినేష్‌ గుండూరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, మల్లికార్జున్‌ ఖర్గేపై పూర్తి విశ్వాసం ఉందని, కాంగ్రెస్‌ను బలోపేతం చేసేలా ఆయన బలోపేతం చేయాలన్నారు.

AP Governor Justice Abdul Nazir : ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకలు ఖర్గేకు స్వేచ్ఛనివ్వాలని, నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని భావించి కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. అయితే 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేసే మేధోమథన సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరుస ఎన్నికల పరాజయాలు, నాయకుల వలసల నడుమ తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకున్న అనంతరం అక్టోబర్‌లో 137 ఏళ్ల పార్టీకి అత్యంత విధేయుడైన మల్లికార్జున్ ఖర్గేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దశాబ్దాల అనంతరం పార్టీకి మొదటి కుటుంబంగా పరిగణించబడుతున్న గాంధీలు తప్పుకోవడం విశేషం.

Heart Attack Constable Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

మూడు రోజుల రాయ్‌పూర్ సమ్మేళనంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించే కీలక నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర ప్రతిపక్ష పార్టీలతో బీజేపీని ఎదుర్కోవడానికి వ్యూహాన్ని ఖరారు చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నాయకత్వ మార్పు అనంతరం ప్రస్తుతం కాంగ్రెస్ అత్యున్నత మండలిగా ఉన్న స్టీరింగ్ కమిటీ సమావేశంలో, పార్టీ నాయకులు ఖర్గే నాయకత్వాన్ని ఆమోదించి, ఆయన నేతృత్వంలోని కొత్త వర్కింగ్ కమిటీకి మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు.