Karnataka: ఆడంబరాలకు దూరంగా కొత్త సీఎం.. వెంటవెంటనే కీలక ప్రకటనలు

కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య గత శనివారంనాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు గంటల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల ఫైలుపై సిద్ధరామయ్య సంతకం చేశారు.

Karnataka: ఆడంబరాలకు దూరంగా కొత్త సీఎం.. వెంటవెంటనే కీలక ప్రకటనలు

CM Siddaramaiah

CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సిద్ధరామయ్య (Siddaramaiah) ఆడంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటవెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మొదట తన కోసం పాటిస్తున్న ‘జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌’ను వెనక్కి తీసుకోవాలని బెంగళూరు పోలీసులను ఆదేశించిన ఆయన, ఇక తనపై ప్రేమను చాటుకోవాలనుకునే వారు పుస్తకాలు ఇవ్వాలంటూ సూచించారు. శాలువాలు, బొకేలు తేవొద్దని సిద్ధూ సూచించారు.

CM Jagan : నేడు మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

ఆదివారం తన అధికారలో ట్విట్టర్‌ ఖాతా సిద్ధరామయ్య స్పందిస్తూ ‘‘వ్యక్తిగతంగా తనను కలుసుకునేందుకు వచ్చేవారు, పబ్లిక్ ఈవెంట్స్‌లో గౌరవ సూచికంగా బోకోలు, శాలువాలు ఇస్తుంటారు. అయితే వాటిని తాను స్వీకరించరాదని నిర్ణయించుకున్నాను. ఎవరైనా బహుమతుల రూపంలో తమ గౌరవాన్ని చాటుకోవాలనుకుంటే పుస్తకాలు ఇస్తే చాలు. నాపై ప్రజలకున్న అభిమానం, ప్రేమ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

Karnataka: సీఎంని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్.. నిమిషాల్లోనే సస్పెండైన ప్రభుత్వ టీచర్

ఇక దీనికి ముందు తనకున్న ట్రాఫిక్ జీరో ప్రొటోకాల్‭ను ఉపసంహరించుకున్నారు. జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ కారణంగా ప్రజలు రోడ్లపై ఎదుర్కొంటున్న సమస్యలు చూసిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ విషయమై బెంగళూరు నగర కమిషనర్‭కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Karnataka Politics: కర్ణాటక అసెంబ్లీని గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. డీకే ఆదేశాల మేరకే ఇలా చేశారట

కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య గత శనివారంనాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా, మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు గంటల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల ఫైలుపై సిద్ధరామయ్య సంతకం చేశారు.