KTR : తెలంగాణలో బీఆర్ఎస్ గెలవడం ముఖ్యం కాదు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR : ఓ పార్టీ మతపిచ్చితో వ్యవహరిస్తోందని, వారికి కూల్చడం తప్ప మరొకటి తెలియదన్నారు. మరో పార్టీ దశాబ్దాలుగా ఉన్న ఏమీ చేయలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదన్నారు.

KTR : తెలంగాణలో బీఆర్ఎస్ గెలవడం ముఖ్యం కాదు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR

KTR On BRS Victory : కొంగరకలాన్ లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవడం ముఖ్యం కాదన్న కేటీఆర్.. 100 సీట్లకు పైగా సాధించాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలన్న కేటీఆర్.. అందుకు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. స్టేబుల్ గవర్నమెంట్-ఏబుల్ లీడర్ ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయన్నారు.

Also Read..BJP: మా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. తెలంగాణలో మాత్రం: అసోం సీఎం హిమంత

ఓ పార్టీ మతపిచ్చితో వ్యవహరిస్తోందని, వారికి కూల్చడం తప్ప మరొకటి తెలియదన్నారు. మరో పార్టీ దశాబ్దాలుగా ఉన్న ఏమీ చేయలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదన్నారు. 100 సీట్లు గెలుస్తామన్న కసితో పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మత పిచ్చితో కాలిపోయే తెలంగాణ వద్దని, పచ్చని పంటల తెలంగాణ కావాలన్నారు కేటీఆర్.

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో ఫాక్స్‌కాన్ కంపెనీకి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. 196 ఎకరాల్లో పరిశ్రమ రానుంది. ఫాక్స్ కాన్ కంపెనీ రూ.1,656 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. వచ్చే మార్చి నుంచి ఫాక్స్ కాన్ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఒక్క ఫాక్స్ కాన్ యూనిట్ తో మొదటి దశలో 35 వేల నుంచి 40వేల ఉద్యోగాలు రానున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పోటీ పరిస్థితుల్లో ఓ పరిశ్రమను కానీ, ఓ సంస్థను కానీ తీసుకురావడం మామూలు విషయం కాదన్నారు కేటీఆర్.

Also Read..Congress: “కర్ణాటక” వ్యూహంతో తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో గెలవాలని కాంగ్రెస్ నిర్ణయం.. ఇవి ప్రకటించే అవకాశం..

ముఖ్యంగా, ప్రధాని మోదీ పెట్టే ఇబ్బందులను తట్టుకుని తెలంగాణకు పరిశ్రమలను ఆకర్షించడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో ఐటీ విభాగం, పరిశ్రమల విభాగం ఎంతో పోరాడుతుంటేనే ఒక్కో పరిశ్రమ, సంస్థ రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు.

కష్టసాధ్యమైన పరిస్థితుల్లో కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని, అయితే, వచ్చిన కంపెనీలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులపైనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఫాక్స్ కాన్ సంస్థేనని కేటీఆర్ వెల్లడించారు. ఇక,
దేశంలో 142 కోట్ల జనాభా ఉంటే.. కేవలం 60లక్షల మందికే ఉద్యోగాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. దేశంలో 0.5శాతం కంటే తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయిన తెలిపారు.