Sonia-Mayawati: మాయావతి-సోనియా గాంధీ పొత్తు కుదరనంత వరకు ఎవరూ ఏమీ చేయలేరట

గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇక అప్పటి నుంచి ఇరు మళ్లీ ఇరుపార్టీల మధ్య ఎలాంటి పొత్తు పొడవలేదు. అయితే 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో బీఎస్పీ కూడా ఉంది.

Sonia-Mayawati: మాయావతి-సోనియా గాంధీ పొత్తు కుదరనంత వరకు ఎవరూ ఏమీ చేయలేరట

mayawati and sonia gandhi

Sonia-Mayawati: బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి, కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ మధ్య ఎన్నికల పొత్తు కుదరనంత వరకు ఎవరూ ఏమీ చేయలేరని సుహేల్‭దేవ్ భారతీయ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఓంప్రకాష్ రాజ్‌భర్ అన్నారు. ఇటీవల ఘాజీపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రాజకీయ సమీకరణాన్ని రూపొందించారు. దేశంలోని విపక్షాలను ఏకం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం సమాజ్‭వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‭ను కలిశారు.

Anand Mohan: గ్యాంగ్‭స్టర్-పొలిటీషియన్ ఆనంద్ మోహన్ విడుదల.. బిహార్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

నితీశ్ పేరు ప్రస్తావిస్తూ ప్రస్తావిస్తూ.. మాయావతి, సోనియా కలవనంత వరకు ఆ ప్రయత్నాలన్నీ విఫలమేనని అన్నారు. గతంలో జనతా పార్టీ విపక్షాలన్నింటినీ ఏకం చేసిందని, దాని ఫలితంగా తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఎస్పీకి దూరంగా నితీశ్ సంచరిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ వారిద్దరినీ నితీశ్ సంప్రదించడం చాలా ముఖ్యమని అన్నారు. దేశంలో బీజేపీ తర్వాత ఈ రెండే పెద్ద పార్టీలని, విపక్షాలు ఏది చేయాలన్నా వాళ్లిద్దరూ కలవాలని, లేదంటే ఎవరూ ఏమీ చేయలేరని మరోసారి నొక్కి చెప్పారు.

Karnataka polls: అల్లర్లంటూ వ్యాఖ్యానించిన అమిత్ షా.. బెంగళూరులో కేసు పెట్టిన కాంగ్రెస్

గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇక అప్పటి నుంచి ఇరు మళ్లీ ఇరుపార్టీల మధ్య ఎలాంటి పొత్తు పొడవలేదు. అయితే 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో బీఎస్పీ కూడా ఉంది. కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో మాయావతి-సోనియా చాలా సన్నిహితంగా కనిపించారు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వీరి మధ్య పొత్తు పొడుస్తుందని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే పొత్తుకు పూర్తిగా వ్యతిరేకం అని కాదు కానీ, బీఎస్పీ నుంచి అయితే ఒక ప్రధాన డిమాండ్ ఉంది. మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పొత్తుకు అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో తెలిపారు.