DK Shivakumar: ఒక కుటుంబానికి ఒకే టికెట్.. కట్టుదిట్టంగా అమలు చేస్తామంటున్న కాంగ్రెస్

దీనిపై అనేక పార్టీలు హామీలు ఇచ్చినప్పటికీ, అమలులో మాత్రం సాధ్యం కావడం లేదు. ఆ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో కాస్త హడావుడి చేసినప్పటికీ, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీని వారసత్వ పార్టీ అంటూ విమర్శలు చేసే బీజేపీలో వారసులు అనేక మంది ఉన్నారు. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతామని, కుటుంబంలో ఒకరికే టికెట్ ఇస్తామని శపథం చేశారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.

DK Shivakumar: ఒక కుటుంబానికి ఒకే టికెట్.. కట్టుదిట్టంగా అమలు చేస్తామంటున్న కాంగ్రెస్

Only 1 ticket per one family says Karnataka Congress chief DK Shivakumar

DK Shivakumar: రాజకీయ పార్టీల్లో కుటుంబ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ ఉండదు. ఒకరు రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకున్నారంటే, ఇక వారి కుటుంబం నేతలు పుట్టుకొస్తుంటారు. ఎన్నికలు వచ్చాయంటే కుటుంబ సభ్యులే తలపడుతున్నారు. దీని వల్ల ప్రజా సేవపై మక్కువ పోయి, అవినీతి రాజకీయాలు పెరిగిపోతున్నాయి. దీంతో రాజకీయాల్లో కుటుంబ జోక్యాన్ని తొలగించాలని, వారసత్వ రాజకీయాలను నిర్మూలించాలని, కుటుంబాల్లోని వ్యక్తులకు టికెట్లు ఇవ్వొద్దంటూ అనేక డిమాండ్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై అనేక పార్టీలు హామీలు ఇచ్చినప్పటికీ, అమలులో మాత్రం సాధ్యం కావడం లేదు. ఆ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో కాస్త హడావుడి చేసినప్పటికీ, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీని వారసత్వ పార్టీ అంటూ విమర్శలు చేసే బీజేపీలో వారసులు అనేక మంది ఉన్నారు. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతామని, కుటుంబంలో ఒకరికే టికెట్ ఇస్తామని శపథం చేశారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అనాగరిక పాలన.. గే సెక్స్, వ్యభిచారం చేసినందుకు కొరడా దెబ్బలు

వచ్చే ఏడాది జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకటే టికెట్‌ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధిష్టానం నిర్ణయించిందని ఆయన అన్నారు. ఈ విషయమై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టికెట్ల కోసం చాలా మంది తన వద్ద, సిద్దరామయ్య వద్ద పైరవీలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. ఎవరికి టికెట్‌ లభించినా అధిష్టానం ఎంపిక చేసే అభ్యర్థి గెలుపుకోసం అందరూ సమష్టిగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. అంతిమంగా పార్టీ ప్రయోజనాలే అందరి లక్ష్యంగా ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కోసం కష్టపడిన అందరికీ ప్రయోజనాలు లభిస్తాయన్నారు. కాగా పార్టీ టికెట్‌ దరఖాస్తులతో పాటు నిధులను సేకరించడం ఇది కొత్త కాదన్నారు. గతంలోనూ సేకరించామని అయితే అప్పట్లో ఇంత ప్రచారం జరగలేదన్నారు. డీకే మాటలు చేతల్లోకి ఎంత వరకు వస్తాయో ఎన్నికలు వస్తే తెలుస్తందని విమర్శకులు అంటున్నారు.

Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న ప్రియాంక వాద్రా (ఫొటోలు)