ఇక 24 గంటలే : ఆ తర్వాత బాధ పడినా ప్రయోజనం లేదు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో మార్చి 11న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతా

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 12:03 PM IST
ఇక 24 గంటలే : ఆ తర్వాత బాధ పడినా ప్రయోజనం లేదు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో మార్చి 11న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతా

అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో మార్చి 11న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం ఏపీలో కలకలం రేపింది. ఓటర్లకు తెలియకుండానే ఓట్లు తొలగిపోయాయి. ఓటు తొలగించాలని ఫారమ్ -7 దరఖాస్తులు లక్షల సంఖ్యలో వచ్చాయి. దీంతో తమ ఓటు ఉందో లేదో అని అంతా కంగారు పడుతున్నారు. ఒక వేళ ఓటు డిలీట్ అయి ఉంటే.. వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఓటరుగా నమోదు  చేసుకోవడానికి సమయం ఇచ్చారు. మార్చి 15వ తేదీతో ఓటరు నమోదు కార్యక్రమం ముగియనుంది. అంటే 24 గంటలే మిగిలాయి. ఆ తర్వాత ఓటు నమోదు చేసుకోవాలని అనుకున్నా  కుదరదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

”ఓటు ఉందో లేదో వెంటనే చూసుకోండి, కొత్తగా ఓటరు నమోదుకు మార్చి 15వ తేదీ వరకే గడువు ఉంది, ఈలోగా నమోదు చేసుకోకపోతే పోలింగ్‌ తేదీన వచ్చి ఓటు లేదంటే మేము ఏమీ చేయలేం’’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో సర్వర్‌ తరచూ మొరాయిస్తోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించడం లేదని ఓటర్లు చెబుతున్నారు. దీంతో చాలామంది తమ ఓటు ఉందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకునేందుకు 24గంటలే మిగిలి ఉన్నాయని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఓటు నమోదు  చేసుకోవచ్చన్నారు. ఆన్ లైన్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురైతే.. ఆఫ్ లైన్ లో ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఎమ్మార్వో ఆఫీస్, వీఎల్వో, మున్సిపల్ ఆపీసులకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని  సూచించారు. ఓటు తొలగించాలని మార్చి 10 తర్వాత వచ్చి ఫారమ్ 7ల ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ద్వివేది చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు  చేస్తున్నామన్నారు.