ఎన్నికల తర్వాత లోటస్ ఆపరేషన్ మరోసారి మొదలవనుందా?

మరోసారి ఆపరేషన్ లోటస్ మొదలుకానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ శుక్రవారం అమిత్ షాను కలిసి చర్చలు జరిపి..

ఎన్నికల తర్వాత లోటస్ ఆపరేషన్ మరోసారి మొదలవనుందా?

మరోసారి ఆపరేషన్ లోటస్ మొదలుకానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ శుక్రవారం అమిత్ షాను కలిసి చర్చలు జరిపి..

రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇవి ఏప్రిల్ 23మంగళవారం నాటికి పూర్తికానున్నాయి. ఈ ఎన్నికల అనంతరం మరోసారి ఆపరేషన్ లోటస్ మొదలుకానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ శుక్రవారం అమిత్ షాను కలిసి చర్చలు జరిపిన విషయం వెలుగులోకి రావడంతో ఈ వాదనలు బలపడ్డాయి. 

రమేశ్ బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షాను శుక్రవారం రాత్రి హుబ్బాలీ ప్రాంతంలో కలిసి బీజేపీలోకి చేరే సమయం గురించి చర్చించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ సురేశ్ అంగడి స్థితిగతులపై ముచ్చటించారు. రమేశ్ జర్కిహోలీ సోదరుడైన మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సతీశ్ జర్కిహోలీ మీదా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

కుండగొల్, చించోలీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు మే19కి షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం 104 అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉంది. ఈ విధంగా చూస్తే ఎన్నికల తర్వాత కర్ణాటకలో లోటస్ ఆపరేషన్ జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.