Coffin Remark: పార్లమెంటును శవ పేటికతో పోల్చిన ఆర్జేడీపై విపక్షాల విమర్శలు

ఆర్జేడీకి నిర్దిష్ట వైఖరి అనేదే లేదు. అప్పుడప్పుడు వారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. మళ్లీ బీజేపీ నుంచి వచ్చిన నితీష్ కుమార్‌ను తమ సీఎంగా చేసుకుంటారు. పాత పార్లమెటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్‌ నుంచి క్లియరెన్స్ లేదనే విషయం గుర్తు పెట్టుకోవాలి. పార్లమెంటును శవపేటికతో ఆర్జేడీ ఎందుకు పోల్చింది?

Coffin Remark: పార్లమెంటును శవ పేటికతో పోల్చిన ఆర్జేడీపై విపక్షాల విమర్శలు

RJD Tweet: నూతన పార్లమెంట్ భవనాన్ని శవ పేటికతో పోలుస్తూ రాష్ట్రీయ జనతా దళ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ఉన్న వ్యతిరేకతను పార్లమెంట్ భవనంపై చూపించడం ఏంటని, ఇది దేశ ప్రతిష్టను దిగజార్చుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలు ఎక్కువగా విపక్షాల నుంచి వినిపిస్తుండడం విశేషం. ఆర్జేడీకి నిర్ధిష్టమైన వైఖరి లేదని, పార్లమెంటును శవపేటికతో పోల్చడం ఏంటని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

PM Modi : మన్ కీ బాత్‍లో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని

ఆదివారం ఆయన స్పందిస్తూ ”ఆర్జేడీకి నిర్దిష్ట వైఖరి అనేదే లేదు. అప్పుడప్పుడు వారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. మళ్లీ బీజేపీ నుంచి వచ్చిన నితీష్ కుమార్‌ను తమ సీఎంగా చేసుకుంటారు. పాత పార్లమెటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్‌ నుంచి క్లియరెన్స్ లేదనే విషయం గుర్తు పెట్టుకోవాలి. పార్లమెంటును శవపేటికతో ఆర్జేడీ ఎందుకు పోల్చింది? ఇంకేదైనా మాట్లాడి ఉండొచ్చు కదా. ఈ కోణంలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ పార్టీ సమాధానం చెప్పాలి” అని అన్నారు.

Wrestlers detained: రెజ్లర్ల అరెస్టుపై వెల్లువెత్తిన వ్యతిరేకత.. నెట్టింట్లో విమర్శల వెల్లువ

ఇక ఆర్జేడీ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ సైతం తీవ్ర స్థాయిలో మండిపడింది. కొత్త భవనం శవపేటిక అయితే పాత భవనాన్ని ‘సున్నా’ అంటారా అంటూ బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ మండిపడ్డారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ప్రభుత్వం మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు. కానీ పార్లమెంట్ భవనం అనేది ఈ దేశ ఆస్తి. ప్రజాస్వామ్యానికి సూచిక. అందులో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు. అలాంటి భవనాన్ని శవపేటికతో పోల్చుతున్నారు. బహుశా వారికి పాత భవనం సున్నాలా కనిపిస్తుండొచ్చు’’ అని దుష్యంత్ అన్నారు.

Kejriwal: ఆసుపత్రికి వెళ్లి హీరోని కలిశాను అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన సీఎం కేజ్రీవాల్

అయితే ఈ ట్వీట్ మీద ఆర్జేడీ వివరణ ఇచ్చింది. ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ, తమ పార్టీ ఇచ్చిన ట్వీట్‌లో శవపేటిక ఉందని, ప్రజాస్వామ్యం సమాధి అవుతోందని చెప్పడమే దాని వెనుక ఉద్దేశమని చెప్పారు. దీనిపై బిహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చినవారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.