Opposition Parties Meet: ఆరంభానికి ముందే అవరోధాల్ని ఎదుర్కొంటున్న విపక్ష పార్టీల సమావేశం? నితీశ్ నెట్టుకొస్తారా?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి ఈ సమావేశంపై ఈ ముగ్గురు నేతల నుంచి ఎలాంటి కామెంట్ కూడా రాలేదు.

Opposition Parties Meet: ఆరంభానికి ముందే అవరోధాల్ని ఎదుర్కొంటున్న విపక్ష పార్టీల సమావేశం? నితీశ్ నెట్టుకొస్తారా?

Bihar: భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో ఏర్పాటు చేయనున్న సమావేశం ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో జరగనున్న విషయం తెలిసిందే. దేశంలోని సుమారు 10-15 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ సమావేశం ఆరంభానికి ముందే కొన్ని అవరోధాల్ని ఎదుర్కొంటోంది. బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ఆరంభానికి ముందే కొన్ని అవరోధాల్ని ఎదుర్కొంటోంది. కారణం.. పార్టీ అధినేతలు మాత్రమే ఈ మీటింగుకి రావాలని నితీశ్ కుమార్ షరతు విధించడం.

Punjab Politics: సిద్ధూ వల్లే భగవంత్ మాన్ సీఎం అయ్యారా.. ఇంతకీ సిద్ధూ భార్య బయటపెట్టిన విషయం ఏంటి?

కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరుపై ఆ పార్టీ నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్‌ రావాలంటే వేదికను నిర్ణయిస్తామని జేడీయూ వర్గాలకు కాంగ్రెస్‌ చెప్పినట్లు సమాచారం. కర్ణాటకలో ఘన విజయం సాధించి మంచి ఊపులోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రంలో బీజేపీయేతర కూటమికి నితీశ్‭ను నాయకుడిగా చూపేందుకు ఆసక్తి చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Manipur Violence: మణిపూర్ అల్లర్లపై ఆరు కేసులు నమోదు.. విచారణ వేగవంతం చేసిన సీబీఐ

ఎన్డీయే కూటమితో బలంగా ఉన్న బీజేపీని ఓడించడానికి దేశంలోని విపక్షాలన్నీ ఏకం కావాలనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో రెండవ పెద్ద జాతీయ పార్టీగా ఉంది. ఇక దానికి మద్దతు ఇచ్చే పార్టీలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి కూటమి ఏర్పాటు చేసేందుకు మొదట నితీశ్ ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాదని, కాంగ్రెస్ పార్టీని కూడా తమతో కలుపుకున్నారు. కానీ కూటమికి తానే నాయకత్వం వహించాలని ఆయన ఆరాటపడుతున్నారు.

MK Stalin: విపక్షాల సమావేశానికి సీఎం స్టాలిన్ వెళ్తారా? ఆయనేం అన్నారు?

ఇక దీనితో పాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి ఈ సమావేశంపై ఈ ముగ్గురు నేతల నుంచి ఎలాంటి కామెంట్ కూడా రాలేదు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ హాజరుపై అనుమానాలే ఉన్నాయి. గతంలో ఢిల్లీకి వెళ్లి మరీ కేజ్రీవాల్‭ను కలిసి వచ్చారు నితీశ్. అయినప్పటికీ కొంత కాలంగా విపక్ష పార్టీలతో కేజ్రీవాల్‭కు దూరం పెరిగింది. మమత బెనర్జీ సైతం మరీ అంత ఆసక్తిగా లేనట్లుగానే కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ సమావేశం జరిగితే కానీ నితీశ్ నాయకత్వంపై కానీ, విపక్షాల కూటమిపై కానీ ఒక క్లారిటీ వచ్చేలా లేదు.