చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్న ఓవైసీ

  • Edited By: madhu , January 5, 2020 / 05:59 AM IST
చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్న ఓవైసీ

చార్మినార్ వద్ద జాతీయ జెండాను MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఎగురవేయనున్నారు. CAAకు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతొక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఆయన ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 10వ తేదీన నగరంలో సీఏఏకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు MIM ప్రకటించింది. 2020, డిసెంబర్ 04వ తేదీ శనివారం సంగారెడ్డిలో యునెైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ నిర్వహించిన బహిరంగసభలో ఓవైసీ పాల్గొని మాట్లాడారు. 

జనవరి 10వ తేదీన నిర్వహించే ర్యాలీ మీర్ ఆలం ఈద్గా నుంచి ప్రారంభమై..శాస్త్రీపురం మైదానంలో ముగుస్తుందని ఓవైసీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ర్యాలీకి నో చెప్పడంతో రాజేంద్రనగర్ శివారులో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తర్వాత జనవరి 25వ తేదీన చార్మినార్ వద్ద భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని, ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించి..అర్ధరాత్రి జాతీయ జెండాను ఎగురవేస్తామని వెల్లడించారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకొనే లక్ష్యంలో భాగంగా కవులను ఈ సభకు పిలుస్తామన్నారు. 

బ్లాక్ లా ఉపసంహరించుకొనే విధంగా మోడీపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సెల్ఫీ వీడియోలు తీసి టిక్ టాక్, ఫేస్ బుక్, యూ ట్యూబ్‌లలో #merasamvidhan హ్యాష్ ట్యాగ్‌తో పోస్టు చేయాలన్నారు. CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా నిరసనలు, శాంతియుతంగా కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే జరుగుతున్న ఆందోళనలతో పాలకులు మేల్కొంటున్నారని, ఆందోళనలు ఇంకా కంటిన్యూ చేయాలన్నారు.

ఆందోళనలకు ఊపు తీసుకొచ్చిన జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు పాదాభివందనం చేస్తున్నట్లు, యూపీలో యోగి ప్రభుత్వం చేసిన చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్ఆర్‌సీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఓవైసీ కోరారు. 

2020, డిసెంబర్ 04వ తేదీ శనివారం నగరంలో మిలియన్ మార్చ్ నిర్వహించాలని 48 సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన వచ్చింది. లక్షలాది మంది జనాలు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Read More : ఛాయ్‌లో చికెన్ టిక్కా తింటే ఎలా ఉంటుంది