నేను హిందువులకు వ్యతిరేకం కాదు : ముస్లింలతో పాటు క్రైస్తవులు, దళితులకు ఇబ్బందులు తప్పవు

NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 02:18 AM IST
నేను హిందువులకు వ్యతిరేకం కాదు : ముస్లింలతో పాటు క్రైస్తవులు, దళితులకు ఇబ్బందులు తప్పవు

NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు

NRC (National Register Of Citizens), NPR (National Population Register) లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు కూడా ఇబ్బందులు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. NRC, CAA (Citizenship Amendment Act) కు వ్యతిరేకంగా ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలో ఎంఐఎం ఆధ్వర్యంలో శుక్రవారం(డిసెంబర్ 27,2019) సభ జరిగింది. దీనికి హాజరైన ఓవైసీ… ఎన్‌పీఆర్‌ను రాష్ట్రంలో అమలు చేయకుండా ఆపాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలో అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకుంటామని తమకు కేసీఆర్‌ హామీనిచ్చినట్టు అసదుద్దీన్‌ తెలిపారు.

కేసీఆర్ ఉన్నంత కాలం వెంట ఉంటా:
కాగా, తాము హిందుత్వానికి వ్యతిరేకం కాదని,  హిందూ సిద్ధాంతాలను తమపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తామని ఒవైసి స్పష్టం చేశారు. కానీ. తమ ముందున్న పని అక్రమ చట్టాలను చించేయడమేనన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ‌లు కేవలం కొన్ని వర్గాల ప్రజల సమస్య కాదని, ఇది యావత్ దేశ ప్రజల సమస్య అని చెప్పారు. 2010, 2020 జనగణనలో చాలా వ్యత్యాసం ఉందని, భారత్‌ను కాపాడుకోవడానికి మనమంతా ఏకం కావాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ కానీ, టీఆరెస్ పార్టీ కానీ సెక్యులరిజానికి కట్టుబడి ఉన్నాయన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం తాను ఆయన వెంట ఉంటానని అసదుద్దీన్ స్పష్టం చేశారు.

నేను హిందువులకు వ్యతిరేకం కాదు:
NRC, CAA, NPR లు రాజ్యాంగానికి విరుద్ధం అని ఒవైసి అన్నారు. అన్ని మతాల సంగమం భారతదేశం అని చెప్పారు. ప్రధాని మోడీ దేశాన్ని ముక్కలు చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. తాను హిందువులకు వ్యతిరేకం కాదన్న ఒవైసి… తన పౌరసత్వం అడిగే హక్కు మోడీకి లేదన్నారు. తెలంగాణను సెక్యులర్ గా ఉంచుతామని సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారని చెప్పారు. ఈ సభకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షకీల్, సురేందర్, జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు హాజరయ్యారు.

Also Read : టీఆర్ఎస్ మాజీ మంత్రులంతా ఎక్కడా?