13దేశాల్లో పారిశ్రామిక వేత్తలతో నాకు పరిచయాలున్నాయి, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తా

ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్లపై పరిమల్ నత్వాని స్పందించారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 10:58 AM IST
13దేశాల్లో పారిశ్రామిక వేత్తలతో నాకు పరిచయాలున్నాయి, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తా

ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్లపై పరిమల్ నత్వాని స్పందించారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన

ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్లపై పరిమల్ నత్వాని స్పందించారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు 12ఏళ్ల అనుభవం ఉందన్నారు. 13 దేశాల్లో పలువురు పారిశ్రామికవేత్తలతో తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పారు. రిలయన్స్ గ్రూప్ తో తనకున్న సంబంధాలు ఏపీకి ఉపయోగపడతాయని అన్నారు. తనకున్న రాజకీయ అనుభవం, పరిచయాలతో ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని నత్వాని చెప్పారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి కృషి చేస్తానని నత్వాని చెప్పడం విశేషం. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని మోడీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా పలుమార్లు చెప్పింది. అయినా..ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి కృషి చేస్తానని పరిమల్ నత్వాని చెప్పడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఏపీ నుంచి పెద్దల సభకు:
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్‌ను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పెద్దల సభకు నామినేట్‌ చేసినందుకు సీఎం జగన్‌కు, వైసీపీకి, ఏపీ ప్రజలకు పరిమల్‌ ధన్యవాదాలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేస్తానని ఆయన తెలిపారు.

స్వయంగా అంబానీ వచ్చి అడిగారు:
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా వచ్చి సీఎం జగన్‌ను కోరారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. దీంతో పార్టీ ముఖ్యనేతలో చర్చించిన అనంతరం పరిమల్‌ను పెద్దల సభకు నామినేట్‌ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని నామినేషన్లు దాఖలు చేశారు. 

ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు:
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లకు మార్చి 7న ఏపీ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. మార్చి 6 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

See Also | జగన్ ఎవరిని కరుణిస్తారో, నెల్లూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం కోసం పోటీ