సీఎం జగన్ పై ద్వేషం లేదు : ప్రజల కోసమే ప్రశ్నిస్తున్నాం

ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారితో వ్యక్తిగత విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 01:31 PM IST
సీఎం జగన్ పై ద్వేషం లేదు : ప్రజల కోసమే ప్రశ్నిస్తున్నాం

ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారితో వ్యక్తిగత విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని

ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారితో వ్యక్తిగత విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. గొప్ప పాలన అందిస్తే మేమే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటామని అన్నారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి విశాఖలో పవన్ మీడియాతో మాట్లాడారు. జనసేన లాంగ్ మార్చ్ కు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు.

లాంగ్ మార్చ్ కు వచ్చిన మద్దతు చూస్తే సమస్య తీవ్రత తనకు అర్థమైందన్నారు. నాపై విమర్శలు చేయడం కాదు.. ఇసుక సమస్యకు పరిష్కారం చూపండి అని ప్రభుత్వానికి సూచించారు పవన్. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజల్లో నమ్మకం కోల్పోతారని వైసీపీ నేతలపై పవన్ మండిపడ్డారు.

ఏపీలో నిర్మాణ రంగం స్థంభించిందని.. ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పవన్ వాపోయరు. ప్రజల సమస్యలనే తాము ప్రభుత్వం ముందుకు తెచ్చామన్నారు. ప్రభుత్వ విధానాల్లో తప్పులుంటే కచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి గడువు ఇచ్చామన్న పవన్.. అప్పటికీ పరిష్కారం చూపకపోతే.. జనసేన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయనే వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు పవన్. రెండు వారాల్లో ఇసుక కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.