2024 ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది అక్కడి నుంచేనా

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణమైన ఫలితాలు చూసింది. జనసేన అభ్యర్థులే కాదు.. జనసేనాని కూడా ఓడిపోయారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసినా పవన్

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 12:08 PM IST
2024 ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది అక్కడి నుంచేనా

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణమైన ఫలితాలు చూసింది. జనసేన అభ్యర్థులే కాదు.. జనసేనాని కూడా ఓడిపోయారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసినా పవన్

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణమైన ఫలితాలు చూసింది. జనసేన అభ్యర్థులే కాదు.. జనసేనాని కూడా ఓడిపోయారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసినా పవన్ గెలవలేకపోయారు. భీమవరం, గాజువాక.. రెండు చోట్లా బొక్క బోర్లా పడ్డారు. జనసేన నుంచి కేవలం ఒకరు మాత్రమే గెలిచారు. ఆయనే రాపాక వరప్రసాద్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు చూసిన పవన్.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించారు.

తనకు రెండు చోట్ల నుంచి పోటీ చేయడం ఇష్టం ఉండదన్న పవన్ కళ్యాణ్.. పార్టీ నేతలు చెప్పడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీకి దిగానన్నారు. 2019 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయాలని కొందరు చెప్పినా.. కుదరలేదన్నారు. ఈసారి తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని పవన్ చెప్పారు. ఈజీగా గెలవాల్సిన సీటు తాడేపల్లిగూడెం అన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలతో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఈసారి పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. తాను ఎక్కడి నుంచి పోటీ చేసే స్థానం గురించి పవన్ పరోక్షంగా హింట్ ఇచ్చారా అని డిస్కస్ చేసుకుంటున్నారు.

ఆదివారం(ఫిబ్రవరి 16,2020) నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జన సైనికులతో భేటీ అయిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా కనిపించిందన్నారు. ఆ ఎన్నికల్లో ఓడినవాళ్లు ఓపెన్ గా ఏడిస్తే, గెలిచిన వాళ్లు ఇంటికెళ్లి ఏడ్చారని ఎద్దేవా చేశారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా టీడీపీకి ఓటమి తప్పలేదన్నారు. అన్ని చోట్ల ఓటర్లను డబ్బుతో కొనలేరన్న దానికి ఇటీవల ఢిల్లీలో ఆప్ విజయమే నిదర్శనమని పవన్ చెప్పారు.

ఆప్ ప్రజల కోసం పని చేసింది కాబట్టే ప్రజలు ఓటేసి గెలిపించారని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ధనరహిత రాజకీయాలే చేస్తానని స్పష్టం చేశారు. ఓటేయడానికి డబ్బు తీసుకున్న ప్రజలు ప్రశ్నించే హక్కు కోల్పోతారని పవన్ అన్నారు. ప్రస్తుతం తాను సినిమాల్లో నటించడానికి కారణం డబ్బేనని, పార్టీ నడపడానికి డబ్బు అవసరం ఉండడంతో సినిమాలు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. ఎవరికో మేళ్లు చేసి వారిచ్చిన డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తిని తాను కానని పవన్ అన్నారు. స్వశక్తి మీద బతకడానికి నాకు సినిమాలు మాత్రమే ఉన్నాయన్నారు. నాకు జగన్ రెడ్డి లాగా మైన్స్ లేవు.. నాపై గెల్చిన గ్రంథి శ్రీనివాస్ మాదిరి ఆక్వా బిజినెస్ లేదన్నారు. నేరస్తులు.. నడిపే రాజకీయ పార్టీలను చూసి.. ఏదో చేయాలని పార్టీ పెట్టానని చెప్పారు. కులం చూసి కాకుండా.. సిద్దాంతాలను చూసి తనను ఇష్టపడాలని పవన్ కోరారు. బాధ్యత గల రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు.