జగన్ సర్కార్ కు పవన్ డెడ్ లైన్

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 02:39 PM IST
జగన్ సర్కార్ కు పవన్ డెడ్ లైన్

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ కు పవన్ డెడ్ లైన్ విధించారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు. ఆదివారం(డిసెంబర్ 8, 2019)తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటించారు. వెలగతోడులో రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రైతు కన్నీరు పెట్టే రాజ్యం సుభిక్షంగా ఉండదన్నారు. రైతుల కన్నీరు తుడిచే ప్రభుత్వాలు ఉండాలన్నారు. అగ్రవర్ణ రైతులకు రైతు భరోసా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కౌలు రైతుల తరపున జనసేన పోరాడుతుందన్నారు. 

తూర్పుగోదావరి జిల్లా  రైతులకు గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు పెడుతుంటే ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో తింటున్నారని విమర్శించారు. 150 మంది ఎమ్మెల్యేలు రైతు రక్తంతో తడిసిన మద్దను తింటున్నారని అన్నారు. ఓట్ల కోసం జగన్ రోడ్లు పట్టుకొని తిరిగారని, పాదయాత్రలో రైతులకు అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. ఆకాశంలో ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారని ఆరోపించారు. 

సీఎం జగన్ ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వమైనా సరే రైతు కడుపు కొడితే కాలిపోవాల్సిందేనని హెచ్చరించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.