వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 01:49 PM IST
వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ చేరుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం జగన్ ప్రధాని మోడీ, అమిత్ షా లను కలిశారనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీతో దోస్తీ, పొత్తు గురించి బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. జగన్ మాకు రాజకీయ ప్రత్యర్థే.. వైసీపీతో ఎలాంటి పొత్తు ఉండదని.. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ తేల్చి చెప్పారు. టీజీ వెంకటేష్ మాత్రం భిన్నంగా స్పందించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని కామెంట్ చేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో సీఎం జగన్ కలవచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు:
ఇలా బీజేపీ, వైసీపీ దోస్తీ గురించి రకరకాల వార్తలు, అభిప్రాయాలు వస్తున్న క్రమంలో.. బీజేపీ మిత్రుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తాను అనుకోవడం లేదని పవన్ అన్నారు. పొత్తు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే.. బీజేపీతో జనసేన ఉండదని పవన్ తేల్చి చెప్పారు. అమరావతిలో మందడం సభలో పవన్ కళ్యాణ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

అదే జరిగితే.. బీజేపీతో నేనుండను:
వైసీపీ, బీజేపీ మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని పవన్ స్పష్టం చేశారు. ఎన్డీయేలో వైసీపీ చేరుతుందని.. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, వైసీపీతో పొత్తు గురించి ఢిల్లీ బీజేపీ నేతలు ఒకలా, ఏపీ బీజేపీ నేతలు మరోలా మాట్లాడుతున్నారని, వారి మాటలు రెండు అర్థాలు ఇస్తున్నాయని పవన్ అన్నారు. ఇది గందరగోళానికి దారితీసిందన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళతానన్నారు. వారి నుంచి క్లారిటీ తీసుకుంటానని చెప్పారు. తన వెంట ఎవరొచ్చినా రాకపోయినా.. అమరావతి రైతుల పక్షాన తాను పోరాడతానని పవన్ స్పష్టం చేశారు. రాజధాని మార్చడం సాధ్యం కాదన్న పవన్.. అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని అని తేల్చి చెప్పారు.

పవన్‌పై ప్రశ్నల వర్షం:
అమరావతి పర్యటనలో ఉన్న పవన్ మందడం సభలో పాల్గొన్నారు. అక్కడ రైతులు పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 3 రాజధానుల నిర్ణయం వెనుక కేంద్రం ఉందా? వైసీపీ ఎన్డీయేలో చేరుతుందా? అని రైతులు ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పవన్ బదులిచ్చారు. బీజేపీ-వైసీపీకి ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు. ఒకవేళ వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. బీజేపీతో జనసేన ఉండదని తేల్చి చెప్పారు. అలాగే 3 రాజధానుల వెనుక కేంద్రం హ్తం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అపార్థం చేసుకోవద్దని రైతులను కోరారు.