Perni Nani-Pawan Kalyan: సినీ జీవితం ఇచ్చిన చిరంజీవిని పవన్ కించపరిచారు: పేర్ని నాని ఫైర్
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఇవాళ పేర్ని నాని మాట్లాడారు. "సినీ జీవితం ఇచ్చిన చిరంజీవిని పవన్ కించపరిచారు. రాజకీయ పార్టీ పెట్టి మూసేశారని చెప్పారు. రాజకీయ నాయకులు మా ఇంట్లో లేరన్నారు. చిరంజీవి కేంద్రమంత్రి కాలేదా? కొత్తగా పదేళ్లక్రితం రాజకీయాలలో వచ్చానని పవన్ అంటున్నారు. అంతముందు యువరాజ్యం లేదా?" అని ప్రశ్నించారు.

Perni Nani-Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఇవాళ పేర్ని నాని మాట్లాడారు. “సినీ జీవితం ఇచ్చిన చిరంజీవిని పవన్ కించపరిచారు. రాజకీయ పార్టీ పెట్టి మూసేశారని చెప్పారు. రాజకీయ నాయకులు మా ఇంట్లో లేరన్నారు. చిరంజీవి కేంద్రమంత్రి కాలేదా? కొత్తగా పదేళ్లక్రితం రాజకీయాలలో వచ్చానని పవన్ అంటున్నారు. అంతముందు యువరాజ్యం లేదా?” అని ప్రశ్నించారు.
“అన్ని పార్టీలు కలిసి వచ్చి పోటి చేయనివ్వండి. జగన్మోహన్ రెడ్డి గెలవకూడదని పోటీ చేస్తున్నారు. మీకోసం, మీ అవసరాలకోసం పోటీ చేస్తున్నామని చెప్పండి. ప్రజలకోసం అంటూ కల్లబొల్లిమాటలు చెప్పవద్దు. తొడగొట్టే బ్యాచ్ మీది.. దుర్యోధనునులు, దుశ్శాసనులను మీ దగ్గరే ఉన్నారు. బందరులో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పారు.. కేవలం కాపు మీటింగ్ అయింది.
జగన్ చెప్పిన మాటకోసం, సిద్ధాంతం కోసం పని చేస్తారు. ఆయన నాయకత్వం లో పనిచేయడం గర్వంగా ఫీలవుతాం. 2014 నుంచి పవన్ పచ్చిగా కాపు కులస్థులను పోగుచేసి చంద్రబాబుకి ఊడిగం చేయిస్తున్నారు. చంద్రబాబుకు దిక్కుతోచక పవన్ తో కులాల గురించి మాట్లాడిస్తున్నారు. కాపులు 60 శాతం మంది జగన్ వెంట ఉన్నారు. కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దర్మమా? ముసుగు తీసి చంద్రబాబుతో కలిసి పోటి చేయండి” అని పేర్ని నాని అన్నారు.
“మచిలీపట్నం సభలో తియ్యటి అబద్ధాలు చెప్పారు పవన్. ఆయన అభిమానులకి రుచించని మాటలకు పంచదారపూతపూసి చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరి ద్వేషం కోసం పార్టీ పొట్టారో చెప్పాలి. బీజేపీతో కటీఫ్ అని చెప్పారు. తెలివితేటలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. యథావిధిగా చంద్రబాబుతో వెళ్తున్నానని చెబుతున్నారు. కులం లేదని చెబుతూ కాపు కులస్థుల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు” అని పేర్ని నాని అన్నారు.
చంద్రబాబు దగ్గరికి వెళితే తప్పేంటి? అంటూ పవన్ చెప్పకనే చెప్పారని విమర్శించారు. నిస్సిగ్గుగా కులరాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో విడివడిగా కాదని, అందరూ కలిసే రండి చూసుకుందామని పేర్ని నాని అన్నారు. 2024 ఎన్నికల్లో చితక్కొట్టి ఇంటికి పంపిస్తామని చెప్పారు.
శాసనసభకు టీ బ్రేక్.. టీడీపీ అభ్యంతరం
నాలుగు ప్రశ్నలను వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. దీంతో ప్రశ్నోత్తరాలు పూర్తి కాకుండా సభను వాయిదా వేయడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. ప్రశ్నలు పూర్తి కాకుండా ప్రశ్నోత్తరాలను వాయిదా సరికాదని పయ్యావుల కేశవ్ అన్నారు. కీలకమైన అప్పర్ భద్ర ప్రాజెక్టుపై వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వాయిదా వేస్తే ఎలా? అంటూ పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ ని తిట్టడానికే టీ-బ్రేక్ ఇచ్చారా?: నిమ్మల
టీ-బ్రేక్ పేరుతో గంటల తరబడి సభను వాయిదా వేసేకంటే.. ప్రశ్నోత్తరాలు కొనసాగించొచ్చు కదా? అని నిమ్మల రామానాయుడు అన్నారు. పవన్ కల్యాణ్ ని తిట్టడానికే సభకు టీ-బ్రేక్ ఇచ్చారా? అంటూ నిమ్మల మండిపడ్డారు. పేర్ని నాని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
Delhi : ఇప్పుడు రాజకీయ పార్టీలకు టార్గెట్ చేసిన బీజేపీ రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుంది : కవిత