మీతో – మీ కోసం : రాచకొండ పోలీసులు..24 గంటలు..ఆన్ లైన్

  • Published By: madhu ,Published On : December 18, 2019 / 02:12 AM IST
మీతో – మీ కోసం : రాచకొండ పోలీసులు..24 గంటలు..ఆన్ లైన్

మీతో మీ కోసం అంటున్నారు రాచకొండ పోలీసులు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆన్ లైన్‌లో 24గంటలూ..సిద్ధంగా ఉంటామని వెల్లడిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన సమయంలో ఆన్ లైన్ ద్వారా సహాయాన్ని పొందచవచ్చని పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. with you – for you..we are online అని పోస్టర్ రిలీజ్ చేశారు. 

వాట్సప్ నెంబర్ 94906 17111, ట్విట్టర్, ఫేస్ బుక్ @rachakondacop ద్వారా సేవలు పొందవచ్చన్నారు. పోలీసు సేవలపై అభిప్రాయాలు చెప్పవచ్చని తెలిపారు. పోలీసులు తప్పు చేస్తే..సోషల్ మీడియా వేదికల ద్వారా..ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావచ్చని సూచించారు. అయితే..పోలీసులను కించపరిచినా..తప్పుడు సమాచారం ప్రచారం చేసినా..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఉత్తమ పోలీస్ స్టేషన్‌ల సంబంధించిన జాబితాలో రాచకొండ పీఎస్ టాప్‌లో నిలిచింది. టాప్ 20లో తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమీషనరేట్‌‌ 14వ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సహాయం కావాలి అని కోరుతున్న మహిళలకు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు.

Read More : మద్యం మత్తులో యాసిడ్ తాగి వ్యక్తి మృతి

ఈ సేవలను మహిళలు ఉపయోగించుకుంటున్నారు. సహాయం కోరిన వారికి రాచకొండ పోలీసులు అండగా నిలిచి..వారిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఇటీవలే ఓ మహిళ తనకు సహాయం కావాలని ఘట్ కేసర్ పెట్రోలింగ్ పోలీసులను కోరింది. వెంటనే స్పందించిన పెట్రోలింగ్ సిబ్బంది..ఆ మహిళ ఉన్న చోటుకు చేరుకుని పెట్రోలింగ్ వాహనంలో క్షేమంగా ఇంటి వద్ద దింపారు. పోలీసులు స్పందించిన తీరు అద్బుతంగా ఉందని సదరు మహిళ కితాబునిచ్చారు.