అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తాం : ప్రధాని మోడీ

  • Published By: veegamteam ,Published On : February 10, 2019 / 07:08 AM IST
అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తాం : ప్రధాని మోడీ

గుంటూరు : అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నామని ప్రధాని మోడీ అన్నారు. అమరావతికి ఎంతో చరిత్ర కలిగి ఉందని.. ఈ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రాముఖ్యత గల స్థలం నుంచే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. గుంటూరులో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మోడీ పాల్గొని, ప్రసంగించారు. మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ అక్షర క్రమంలోనే కాదు అన్ని అంశాల్లో అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ’మీరు చూపుతున్న ప్రేమ…మీ కోసం నిరంతరం పని చేసేలా స్ఫూర్తినిస్తోంది’ అని అన్నారు. గుర్రం జాషువా, మహాకవి తిక్కన్న జన్మించిన స్థలం గుంటూరు జిల్లా అని..ఎంతో మంది మహానుభావులను అందించిన నేల గుంటూరు జిల్లా అని కొనియాడారు. మీరు తనపై ప్రేమను చూపిస్తున్నారని తెలిపారు. 

పెట్రోలియం రంగంలో అవసరాల దృష్ట్యా మనకు అనుగుణంగా ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. గ్యాస్, పెట్రోలియం రంగాలకు ఏపీ అనువైన ప్రాంతమన్నారు. మూడు జాతీయ ప్రాజెక్టులను జాతికి అంకింతం చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగరాల్లో నేరుగా పైపులైన్ ద్వారా ఇంటికి వచ్చేటట్లు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

2014లో కేవలం 55 శాతం మందికే గ్యాస్ కనెక్షన్స్ ఉండేవి.. ఇప్పుడు మాత్రం 90 శాతం మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఉజ్వల యోజన పథకం కింద 6 కోట్ల 25 లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్ష్లు ఇచ్చామన్నారు. పేదవాళ్లు, గిరిజనులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. నాలుగేళ్లలో 13 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ వల్ల సాధ్యం కానిది తమ వల్ల సాధ్యమైందన్నారు. గత పాలకులు పేదల్ని, మహిళల్ని పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు తనను తట్టివారి జాబితాలో చేరిపోయారని పేర్కొన్నారు. 

దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలను గ్యాస్, పెట్రోలియం హబ్ గా వచ్చే కొన్నేళ్లలో ఎన్నో మార్పులు దేశంలో చూస్తారని పేర్కొన్నారు. కొత్త ఓటర్లు వచ్చే ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అద్భుత ప్రాజెక్టులకు ఇప్పుడే ప్రారంభోత్సవం చేశానని తెలిపారు. ఈ ప్రాజెక్టులు కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాదు దేశానికి కూడా గర్వకారణమన్నారు. కృష్ణా గోదావరి బేసిన్ లో ఓన్జీసీ ఎస్1 ప్రాజెక్టు ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. ఆర్థిక పరిపుష్టితో నవ భారత్ ను నిర్మిస్తామన్నారు.

సీఎం చంద్రబాబుపై ప్రధాని మోడీ మీద నిప్పులు చెరిగారు. సీనియార్టీ వెన్నుపోటు పొడవడంలోనే చూపిస్తున్నాడు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కొడుకును వృద్ధి చేసుకోవడమే సరిపోతుందని తిట్టిపోశారు. టీడీపీ శ్రేణులు మోడీ గ్యో బాక్ అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నందుకు ధన్య వాదాలు తెలిపారు. చంద్రబాబు గురించి మాట్లాడటానికే ఇక్కడకు వచ్చానని చెప్తూ పార్టీ విలువలు మర్చిపోయి కాంగ్రెస్ ముందు మోకరిల్లాడని గుర్తు చేశారు.
 
’కొన్ని సత్యాలను చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆంధ్ర‌ప్రదేశ్‌లో పరిస్థితులను మార్చుతామన్న సీఎం, తానే మారిపోయాడు. రాష్ట్రానికి కొత్త రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పి తన పార్టీని నిర్మించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. బాబు.. నా కన్నా తానే సీనియర్ అని చెప్తున్నారు. నిజమే, పార్టీలు ఫిరాయించడంలో, కొత్త కూటములు కట్టడంలో మీకు మీరే సీనియర్లు. మామకు వెన్నుపోటు పొడవడంలో మీరే సీనియర్లు. ఆంధ్రాకలలకు నీరుగార్చడంలో మీరే సీనియర్లు. ఇన్నాళ్లు మీరు సీనియర్ నాయకులనే మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుకుంటూ వచ్చాను. ప్రజాసంక్షేమం విషయంలో మీరిచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం చూస్తూ ఊరుకోను’ అని హెచ్చరించారు.