బందర్ రోడ్డులో ఉద్రిక్తత : వైసీపీ ఎమ్మెల్యేని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో ఇసుక దీక్షలు రాజకీయాలను వేడెక్కించాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 05:24 AM IST
బందర్ రోడ్డులో ఉద్రిక్తత : వైసీపీ ఎమ్మెల్యేని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో ఇసుక దీక్షలు రాజకీయాలను వేడెక్కించాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర

ఏపీలో ఇసుక దీక్షలు రాజకీయాలను వేడెక్కించాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి సైతం దీక్షకు సిద్ధమయ్యారు. చంద్రబాబు దీక్షకి పోటీగా దీక్ష చేస్తానని ప్రకటించారు. ధర్న చౌక్ సమీపంలోనే దీక్షకు కూర్చుంటానని చెప్పారు. పోలీసులు పర్మిషన్ లేదని చెప్పినా ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోలేదు. దీక్షకు బయలుదేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. పార్థసారథి ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.

ఇసుక అక్రమ రవాణాలో తనపై ఆరోపణలు చేశారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్థసారథి. చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా అంటూ నిలదీశారు. చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ విడుదల చేసిన చార్జ్ షీటుకి నిరసనగా దీక్షకు కూర్చుంటానని పార్థసారథి చెప్పారు. అయితే ఆయన దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, అందుకే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు.

ఎమ్మెల్యే పార్థసారథి దీక్షకు మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. చంద్రబాబుపై మండిపడ్డారు. ఐదేళ్లు ఇసుక మాఫియా నడిపింది చంద్రబాబు కాదా అని మంత్రి ప్రశ్నించారు. దీక్ష పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని సీరియస్ అయ్యారు. ఇసుకను అడ్డుపెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు. వరద తగ్గినందుకు ఇసుక తీయడం ప్రారంభమైందని.. 2 రోజుల్లో రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. వైసీపీ పాలనలో ఎక్కడా ఇసుక మాఫియా లేదని స్పష్టం చేశారు.