పోలింగ్ బూత్ ఆక్రమణ : కోడెలపై కేసు నమోదు

గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 11న

  • Published By: veegamteam ,Published On : April 16, 2019 / 11:52 AM IST
పోలింగ్ బూత్ ఆక్రమణ : కోడెలపై కేసు నమోదు

గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 11న

గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 11న పోలింగ్ రోజున కోడెల.. పోలింగ్ బూత్ ఆక్రమణకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెలను 7వ నిందితునిగా చేర్చారు. కోడెలతో పటు మరో 22మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి

సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో పోలింగ్‌ బూత్‌ ఆక్రమణకు పాల్పడిన కోడెల శివప్రసాదరావు, అతని అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇనిమెట్లలో కోడెలపై దాడి అంటూ టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారని వారు మండిపడ్డారు. ఏప్రిల్ 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనపై వైసీపీ నేతలు దాడి చేశారని కోడెల ఆరోపించారు.

కోడెల బట్టలు చిరిగేలా వైసీపీ వాళ్లు దాడి చేశారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. వైసీపీ వాదన మరోలా ఉంది. కోడెల పోలింగ్ బూత్ ను ఆక్రమించారని, పోలింగ్ బూత్ లోకి వెళ్లి చాలాసేపు తలుపులు మూసుకున్నారని, దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు కోడెలపై తిరగబడ్డారని చెబుతున్నారు. కోడెలపై దాడి కేసులో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు సహా పలువురు నేతలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్