ప్రణబ్‌ పుస్తకంతో ఇంట్లో చిచ్చు.. అక్కా తమ్ముళ్ల మధ్య వైరం!

ప్రణబ్‌ పుస్తకంతో ఇంట్లో చిచ్చు.. అక్కా తమ్ముళ్ల మధ్య వైరం!

Pranab Mukherjee Memoir Book Controversy : దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాసిన ఆఖరి పుస్తకం ‘The Presidential Memoirs’ ఆయన ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ప్రణబ్ కుమారుడు, కుమార్తెల మధ్య విభేదాలకు దారి తీసింది. ఒకరేమో విడుదల చేయాలని అంటుంటే.. మరొకరు ఆపొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.

ప్రణబ్ రాసిన ఆ పుస్తకాన్ని తన అనుమతి లేకుండా ప్రచురించ కూడదని  కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ చెబుతున్నారు. అలాగే పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని ఆయన సోదరి శర్మిష్ట ముఖర్జీ విజ్ఞప్తి చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా ప్రణబ్‌ ముఖర్జీకి పేరొంది. ఆయన రాసిన ఈ చివరి పుస్తకంలో ఆయన సోనియాగాంధీ పైనా, మన్మోహన్‌ సింగ్‌పైనా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవన్ని ఇటీవలే బయటకు వచ్చాయి. రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని ఆయన రాసుకొచ్చారు. తనకు తెలిసిన ఇన్‌సైడ్‌ సమాచారాన్ని అందులో పొందుపరిచారు ప్రణబ్‌.

ప్రణబ్ రాసిన ఈ పుస్తకం బయటవారిలో కాకుండా ఇంట్లోనే వివాదానికి దారితీసింది. అక్కా తమ్ముళ్ల మధ్య విభేదాలకు దారి తీయడంతో చర్చనీయాంశంగా మారింది. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని కుమారుడు అభిజిత్ చెబుతున్నారు.

అప్పటివరూ పుస్తకం విడుదలను నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పిన విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అభిజిత్‌ సోదరి శర్మిష్ట మాత్రం ఖండించారు. చీప్‌ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె ట్వీట్‌ చేశారు. దీంతో ఇరువురి మధ్య వైరం మరింత ముదిరింది.