Land for Jobs Scam: ఆసుపత్రిలో గర్భిణీ భార్య.. సీబీఐ విచారణకు రానన్న తేజశ్వీ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

Land for Jobs Scam: ఆసుపత్రిలో గర్భిణీ భార్య.. సీబీఐ విచారణకు రానన్న తేజశ్వీ యాదవ్

Pregnant wife in hospital, Tejashwi Yadav to skip CBI summons

Land for Jobs Scam: లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో సీబీఐ నుంచి సమన్లు ఎదుర్కొన్న రాష్ట్రీయ జనతా దళ్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‭ శనివారం నాటి సీబీఐ విచారణకు హాజరు కావడం లేదని పార్టీ ప్రకటించింది. గర్భిణి అయిన తేజశ్వీ భార్య ఉన్నట్టుండి స్పృహ తప్పిపడిపోయిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నందున సీబీఐ విచారణకు తేజశ్వీ డుమ్మా కొట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Delhi Liquor Case: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ.. ఆఫీసు దగ్గర టెన్షన్ టెన్షన్

లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో తేజశ్వీకి మార్చి 4వ తేదీన సబీఐ సమన్లు పంపింది. అయితే సీబీఐ ముందు తేజశ్వీ హాజరు కాలేదు. దీంతో తేజశ్వీపై ఆధారాలు, పేపర్ ట్రయిల్ ఆధారంగా రెండోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే తాజాగా భార్య ఆసుపత్రిలో ఉన్న కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి తేజశ్వీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Pulwama Widows Protest: తీవ్ర స్థాయికి చేరిన పుల్వామా వితంతువుల నిరసన

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరికీ మార్చి 15న సమన్లు జారీ చేయనున్నారు. 2004-2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో లాలూ కుటుంభ సభ్యులకు భూములు, ఆస్తులు తక్కువ ధరకు బదిలీ చేశారట. అందుకు గాను రైల్వేలో ఆయన ఉద్యోగాలు ఇప్పించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. సీబీఐ ఫిర్యాదు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ కేసు నమోదు చేసింది.