మందు బాబులకు షాక్ : నేడూ మద్యం దొరకదు

  • Published By: madhu ,Published On : January 27, 2020 / 02:11 AM IST
మందు బాబులకు షాక్ : నేడూ మద్యం దొరకదు

మందుబాబులకు షాకింగ్ న్యూస్. కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరకదు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు అంటే..జనవరి 27వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరకదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో మందు కావాలంటే..వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడనుంది. అయితే..ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే. అనంతరం మద్యం దొరకనుంది. 

అసలు ఎక్కడ మద్యం షాపులు బంద్ ఉంటాయనేగా మీ డౌట్. రాచకొండ కమీషనరట్ పరిధిలో. మున్సిపాల్టీలు, కార్పరేషన్, మేయర్ ఎన్నికలు జరుగనున్న సందర్భంగా పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం అమ్మకాలు జరుపొద్దని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

* రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 7 కార్పొరేషన్‌, 111 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. 
* కాంగ్రెస్‌ మూడు మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. 
* బీజేపీ, ఎంఐఎం తలా రెండు మున్సిపాలిటీల్లో గెలిచాయి. 

* 2020, జనవరి 27వ తేదీ సోమవారం మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగనున్నాయి. 
* ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు  ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. 
* నూతన సభ్యులతో తొలుత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

* మధ్యాహ్నం 12.30 తర్వాత మేయర్లు, చైర్మన్లను సభ్యులు ఎన్నుకుంటారు. 
* ఈ ఎన్నిక ముగిసిన తర్వాతే డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. 
* 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.

Read More : జాగ్రత్త పడండి : 24 గంటలు నీటి సరఫరా బంద్..ఎక్కడంటే