Rahul Gandhi: కొత్త పాస్‭పోర్ట్ తీసుకున్న రాహుల్ గాంధీ.. నేడు అమెరికాకు ప్రయాణం

సోమవారం సాయంత్రం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు రాహుల్‌ బయలుదేరనున్నారు. వారం రోజుల పాటు అమెరికాలోని మూడు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. తొలుత శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటిస్తారు.

Rahul Gandhi: కొత్త పాస్‭పోర్ట్ తీసుకున్న రాహుల్ గాంధీ.. నేడు అమెరికాకు ప్రయాణం

America Tour: పార్లమెంటు ఎంపీగా ఆయనపై వేటు పడటంతో తన డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును తిరిగిచ్చేశారు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ. దీంతో ఆయన సాధారణ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇది ఆదివారం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో రాహుల్ నిందితుడిగా తేలడంతో పాస్‌పోర్టు జారీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, పదేళ్లకు బదులు మూడేళ్ల కాలానికి రాహుల్‌ సాధారణ పాస్‌పోర్టును తీసుకోవచ్చని తీర్పునిచ్చింది.

MP Asaduddin Owaisi: మేముంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరు.. గుర్తుంచుకోండి .. అందుకే అమిత్ షాకు నేనంటే భయం

ఇక ఇదే పాస్‭పోర్టుతో ఈరోజు (సోమవారం) సాయంత్రం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు రాహుల్‌ బయలుదేరనున్నారు. వారం రోజుల పాటు అమెరికాలోని మూడు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. తొలుత శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటిస్తారు. అలాగే జూన్ 4న నూయర్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం జూన్ 10న రాహుల్ పర్యటన ముగుస్తుంది.

Erdogan: టర్కీ ఎన్నికల్లో ఎర్డోగాన్ మరోసారి విజయం.. 11వ సారి అధ్యక్షుడిగా ఎన్నిక

మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు కోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడంతో ఎంపీగా అనర్హత వేటు పడింది. దీని ఫలితంగా దౌత్య పాస్ పోర్ట్ సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను రాహుల్ సరెండర్ చేశారు. దీంతో ఇప్పుడు కొత్త పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ పేరు ఉన్న కారణంగా పాస్ పోర్టు జారీ కోసం నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్ ఇవ్వాలని ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు రాహుల్‭కు ఊరటనిచ్చేలా ఆదేశాలు ఇచ్చింది.