Bharat Jodo Yatra: యాత్ర నుంచి తప్పుకోనున్న రాహుల్ గాంధీ.. కారణమేంటో తెలుసా?

కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించిన అనంతరం మూడవరోజు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలోనే రాహుల్ నుంచి కాల్ వచ్చింది. మోకాలికి గాయమైందని, నడవడం కాస్త ఇబ్బందిగా ఉందని, మరో నాయకుడితో యాత్ర సాగించాలని రాహుల్ నాతో చెప్పారు. ఆ సమయంలోనే ప్రియాంక గాంధీ వాద్రాతో కొనసాగించాలని మేం ప్రతిపాదించాం. కానీ మరో నాయకుడితో చేయాలంటూ ఆమె సూచించారు

Bharat Jodo Yatra: యాత్ర నుంచి తప్పుకోనున్న రాహుల్ గాంధీ.. కారణమేంటో తెలుసా?

Rahul Gandhi Nearly Quit Bharat Jodo Yatra Over Knee Pain

Bharat Jodo Yatra: 2014 నుంచి ఢీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నూతన ఉత్సహాన్ని తీసుకువచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన యాత్రతో నాయకుడిగా రాహుల్ గాంధీ సైతం కొన్ని క్రెడిట్ పాయింట్స్ కొట్టేశారని విమర్శకులే అంటున్నారు. పార్టీకి వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకి ఇంతటి బూస్ట్ ఇచ్చిన యాత్ర కొనసాగింపుపై అనేక అంచనాలు ఉన్నాయి. అయితే రెండవ దశ భారత్ జోడో యాత్ర నుంచి రాహుల్ గాంధీ తప్పుకోనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ యాత్ర మొదటి దశ ముగియక ముందే ఈ లీకులు వచ్చినప్పటికీ, స్పష్టత మాత్రం లేదు. కానీ, తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి వేణుగోపాల్ ఆదివారం చేసిన ఈ స్పష్టత వచ్చింది.

AP New Governor: ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

రాహుల్ గాంధీ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నారని, అందుకే భారత్ జోడో యాత్ర రెండవ దశలో పాల్గొనకపోవచ్చని వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే రాహుల్ స్థానాన్ని ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో భర్తీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దక్షిణం నుంచి ఉత్తరం వరకు రాహుల్ పాదయాత్ర చేశారు. ఇక ప్రియాంక పశ్చిమ నుంచి తూర్పు వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.

Maharashtra: పదవీకాలం పూర్తి కాకముందే మహారాష్ట్ర గవర్నర్‭గా తప్పుకున్న కోశ్యారీ

‘‘కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించిన అనంతరం మూడవరోజు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలోనే రాహుల్ నుంచి కాల్ వచ్చింది. మోకాలికి గాయమైందని, నడవడం కాస్త ఇబ్బందిగా ఉందని, మరో నాయకుడితో యాత్ర సాగించాలని రాహుల్ నాతో చెప్పారు. ఆ సమయంలోనే ప్రియాంక గాంధీ వాద్రాతో కొనసాగించాలని మేం ప్రతిపాదించాం. కానీ మరో నాయకుడితో చేయాలంటూ ఆమె సూచించారు’’ అని కేరళలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేణుగోపాల్ తెలిపారు. అయితే ఫిజియోథెరపిస్ట్ సహాయంతో కోలుకున్న రాహుల్ గాంధీ.. విజయవంతంగా యాత్ర పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు.