Rahul Press meet: ఏం చేసుకుంటారో చేసుకోండి, తగ్గేదే లేదు.. అనర్హతపై మోదీకి రాహుల్ ఛాలెంజ్

అదానీకి అడ్డదారిలో దేశ సంపదను కట్టబెట్టిన విషయాన్ని తాను లేవనెత్తానని అన్నారు. విమానంలో అదానీ-మోదీ కలిసి ఉన్న ఫొటోను తాను పార్లమెంటు సాక్షిగా బయటపెట్టానని, అయితే పార్లమెంటులో తాను ప్రసంగిస్తుంటే మైక్ కట్ చేశారని అన్నారు. ఈ విషయమై తాను లోక్‭సభ స్పీకరుతో మాట్లాడానని రెండు సార్లు నోట్ ఇచ్చానని అన్నారు. తాను దేశం కోసం ప్రశ్నిస్తున్నానని, తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రశ్నించడం మాత్రం ఆపబోనని అన్నారు.

Rahul Press meet: ఏం చేసుకుంటారో చేసుకోండి, తగ్గేదే లేదు.. అనర్హతపై మోదీకి రాహుల్ ఛాలెంజ్

Rahul Gandhi pressmeet on disqualification

Rahul Press meet: లోక్‭సభ సభ్యత్వంపై అనర్హత వేటు ఎదుర్కొన్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ శనివారం తొలిసారి ప్రెస్‭మీట్ ద్వారా స్పందించారు. అదానీ-మోదీ స్నేహంపై తాను ప్రశ్నలు లేవనెత్తినందునే తన గొంతు నొక్కాలని అనర్హత వేటు వేసినట్లు రాహుల్ ఆరోపించారు. అదానీ గ్రూపుకి చెందిన షెల్ కంపెనీల్లో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, అవి కూడా చైనాకు చెందిన కంపెనీల నుంచి వచ్చాయని, వాటి గురించి తాను ప్రశ్నించానని అన్నారు. అదానీ-మోదీ స్నేహం ఇప్పుడు కొత్తది కాదని, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఎన్నికైన నాటి నుంచే వారి మధ్య స్నేహం కొనసాగుతోందని రాహుల్ అన్నారు.

Bandi Sanjay Kumar: దొంగలను పట్టుకోండంటే మాకు నోటీసులిచ్చారు? కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే

‘‘నన్ను మాట్లాడనివ్వక పోవడంపై స్పీకర్ ఓంబిర్లాకు రెండుసార్లు నోటీసు ఇచ్చాను. నిజాంగా ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తే అయితే నాకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? రాజకీయ పార్టీలకు ఇదివరకటిలా మీడియా సంస్థల నుంచి లభించిన మద్ధతు ఇప్పుడు లేదు.  నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అనర్హత వేటు వేశారు. ఓబీసీ వ్యవహారం కూడా అందుకే పైకి తీస్తున్నారు. కానీ ఇది మోదీ-అదానీల సంబంధానికి సంబంధించిన వ్యవహారం. నేను నిజం మాట్లాడతాను. మాట్లాడుతూనే ఉంటాను. నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు’’ అని అన్నారు.

Rahul Press meet: నేను సావర్కర్ కాదు, గాంధీని.. ‘సారీ’పై రాహుల్ సెటైర్లు

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘పార్లమెంటులో నేను మాట్లాడబోయే అంశాల గురించి మోదీ భయపడ్డారు. నాపై అనర్హత వేటు వేయడానికి అదే కారణం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, లేకున్నా నా పని నేను చేసుకుంటా. నన్ను జైల్లో పెట్టినా సరే నా పని నేను చేస్తాను. ప్రతిపక్షాలకు ప్రధాని ఒక గట్టి ఆయుధాన్ని ఇచ్చారు. ప్రధాని చర్యలతో ఆయన చేసిన తప్పు గురించి చర్చ జరుగుతోంది. అదానీ ఒక అవినీతి, అక్రమార్కుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని ప్రధాని మోదీ ఎందుకు కాపాడాలని చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అదానీ గురించి అడిగితే.. దేశంపై దాడి అంటున్నారు. అంటే అదానీయే దేశమని ప్రధాని చెబుతున్నారా?’’ అని రాహుల్ ప్రశ్నించారు.

Minister Kakani Govardhan Reddy: మా ఇష్టారీతిలో ఓటేస్తామంటే కుదరదు.. జగన్ వెంటే నెల్లూరు ప్రజలు

‘‘నేను మళ్లీ మాట్లాడితే అదానీ గురించి ఏం మాట్లాడతానోనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భయపడుతున్నారు. ఆయన కళ్లలో నాకు అదే కనిపిస్తోంది. మొదట మౌనంగా ఉన్నారు. అయినప్పటికీ నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత అనర్హత వేటు వేశారు. అనర్హతే కాదు, వాళ్లు నన్ను ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నించినా, నా గొంతు నొక్కినా ప్రశ్నలు మాత్రం ఎంత మాత్రం ఆపబోను. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. నాకు ప్రేమను పంచింది. గౌరవాన్ని ఇచ్చింది. ఈ దేశ బాగు కోసం ఎంత వరకైనా వెళ్తాను’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

విపక్షాలకు ధన్యవాదాలు
అనర్హత వేటుపై తనకు మద్దతుగా నిలిచిన విపక్షాలకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. సుమారు 14 విపక్ష పార్టీలు లోక్‭సభ స్పీకర్ ఓంబిర్లాకు శుక్రవారం లేఖ రాశారు. రాహుల్ గాంధీ మీద తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్దమని, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ఇది అద్దం పడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో ఇది చీకటి రోజని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.