Rahul Gandhi: రెండేళ్ల జైలు శిక్షపై మహాత్మ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ

ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్‌లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేసులో రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది

Rahul Gandhi: రెండేళ్ల జైలు శిక్షపై మహాత్మ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi reacts to 2 years in jail in Modi surname defamation case

Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు తప్పుబట్టింది. రాహుల్‭కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. మోదీని అవమానించేలా వ్యాఖ్యానించారంటూ దాఖలైన పరువునష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం ఈ తీర్పు వెలువరించింది. కాగా, కోర్టు తీర్పు అనంతరం రాహుల్ స్పందించారు. ‘నా మతం సత్యం, అహింస’ అన్న మహాత్మ గాంధీ వ్యాఖ్యలను రాహుల్ ప్రస్తావించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నా మతం సత్యం మీద అహింస మీద ఆధారపడి ఉంది. సత్యమే నా నిజమైన దేవుడు, అహింస దానిని పొందే మార్గం’’ అని గాంధీ అన్న మాటల్ని ట్వీట్ చేశారు.

CM KCR: తెలంగాణ రైతుల్ని మేమే ఆదుకుంటాం.. ఎకరానికి పదివేలు ఇస్తాం: సీఎం కేసీఆర్

2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ గురించి రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 13, 2019న రాహుల్ మాట్లాడుతూ ‘‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలంతా మోదీ ఇంటి పేరుతోనే ఎందుకు ఉంటారు’’ అని ప్రశ్నించారు. మోదీపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గుజరాత్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీంతో సెక్షన్ 499, సెక్షన్ 500 కింద రాహుల్‌పై కేసులు నమోదయ్యాయి. దీనిపై సూరత్ జిల్లా కోర్టులో నాలుగేళ్లుగా వాదనలు కొనసాగాయి.

BJP : నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులు.. నియమించిన జేపీ నడ్డా

ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్‌లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేసులో రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువడనున్న నేపథ్యంలో గురువారం ఉదయం రాహుల్ గాంధీ సూరత్ చేరుకున్నారు. ఈ తీర్పుపై రాహుల్ స్పందించాల్సి ఉంది.