Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్.. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు
రాఫేల్ యుద్ధ విమానాల వ్యవహారాల సమయంలో మోదీని ఉద్దేశించి ‘కమాండర్ ఇన్ తీఫ్’ అని విమర్శించారంటూ బీజేపీ నాయకుడు ఒకరు గిర్‌గాంలో కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్.. ‘‘హత్య కేసులో నిందితుడైన అమిత్ షా.. బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు

rahul recieve notice from loksabha housing committee for vacate official residance
Rahul Gandhi: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే అనర్హత వేటుతో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆయన, ఎంపీ పదవి కింద కేటాయించిన అధికారిక బంగళాను ఖాళీ చేయాలంటూ నోలీసులు అందాయి. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను నెల రోజుల్లో ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చిన లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. 12-తుగ్లక్ లేన్లో ఉన్న నివాసంలో రాహుల్ ఉంటున్నారు. 2004 నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. పరువునష్టం కేసులో మార్చి 23న సూరత్ జిల్లా కోర్టు దోషిగా నిర్దారించడం రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద రాహుల్ గాంధీ అనర్హత వేటు ఎదుర్కొన్నారు.
Tejashwi Yadav: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తేజస్వీ యాదవ్ భార్య
కాగా, రాహుల్ మీద దేశంలో డజనుకుపైగా క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. వివిధ సందర్భాల్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఇవి నమోదు అయ్యాయి. అయితే రాహుల్ మాత్రం ఎవరి మీద ఇలాంటి పరువు నష్టం కేసులు నమోదు చేయలేదు. ఆయనను ‘పప్పు’ అనడమే కాకుండా.. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనేక రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు.
Mahua Moitra: బీజేపీ నేతలపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు
కానీ ఆర్‌ఎస్ఎస్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై కేసులు నమోదయ్యాయి. ‘‘దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకుంది?’’ అన్న వ్యాఖ్యపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ఒక్క సూరత్ కోర్టు మాత్రమే తీర్పు వెలువరించింది. 2014లో ఠాణేలో జరిగిన సభలో ప్రసంగించిన రాహుల్… గాంధీజీని ఆరెస్సెస్ వారు హత్య చేశారని ప్రశ్నించారు. అయితే రాహుల్ తప్పుడు ఆరోపణ చేశారని భివండీకి చెందిన ఆ సంస్థ నాయకుడు కేసు పెట్టారు.
Karnataka: మాజీ సీఎం యెడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
రాఫేల్ యుద్ధ విమానాల వ్యవహారాల సమయంలో మోదీని ఉద్దేశించి ‘కమాండర్ ఇన్ తీఫ్’ అని విమర్శించారంటూ బీజేపీ నాయకుడు ఒకరు గిర్‌గాంలో కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్.. ‘‘హత్య కేసులో నిందితుడైన అమిత్ షా.. బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై అహ్మదాబాద్ కోర్టులో బీజేపీ కార్పొరేటర్ ఒకరు కేసు పెట్టారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలో ప్రసంగించిన రాహుల్ ‘‘సావర్కర్ బ్రిటిషు వారిని క్షమాపణలు కోరారు’’ అని అన్నారు. దీనిపై సావర్కర్ మనుమడు వినాయక్ సావర్కర్, శివసేన అధినేత షిండే (ప్రస్తుత ముఖ్యంత్రి) వేరువేరుగా రెండు దావాలు వేశారు.